లైంగిక వేధింపులపై స్పందించిన ఆదిమూలం-టీడీపీ నెక్ట్స్ యాక్షన్ ఇదే..!

ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ఎమ్మెల్యేపై వచ్చిన తీవ్ర ఆరోపణ కావడంతో టీడీపీ కూడా ఘాటుగానే స్పందించింది. పార్టీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించిన కోనేటి ఆదిమూలంపై ఇవాళ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఈ వీడియోపై ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన స్పందించారు.

టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపులపై పార్టీ మహిళా కార్యకర్త హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఆదిమూలం.. అది మార్ఫింగ్ వీడియో అన్నారు. పార్టీలో కొందరు తనకు గిట్టని వాళ్లే ఇలా మార్ఫింగ్ వీడియో పెట్టి తనను ఇరికించారని వాపోయారు. దీనిపై అధిష్టానానికి తగిన వివరణ ఇస్తానని చెప్పుకొచ్చారు. ఇది తన నియోజకవర్గంలో కొందరు టీడీపీ నేతల పనే అని తేల్చేశారు.

suspended tdp mla reacted on sexual harassment video tdp waiting for fsl report

అయితే టీడీపీ అధిష్టానం మాత్రం ఆదిమూలంపై ఆగ్రహంగా ఉంది. ఆదిమూలాన్ని ఇప్పటికే సస్పెండ్ చేసిన అధిష్టానం.. ఇప్పుడు తదుపరి చర్యలపై ఫోకస్ పెట్టింది. ఆదిమూలం ఉన్నట్లుగా చెప్తున్న వీడియోలను ఎఫ్ఎస్ఎల్ కు పంపి పరీక్షలు చేయిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ వీడియోలు వాస్తవమని తేలితే అప్పుడు తదుపరి ఏం చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని ఆయన వెల్లడించారు. దీంతో టీడీపీ ఆదిమూలం విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+