అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొలికి: వివాదంలో స్విస్ ఛాలెంజ్ విధానం, కేంద్రం అనుమతి తప్పనిసరా?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురువుతున్నాయి. తాజాగా అమరావతి డెవలప్‌మెంట్ పాట్నర్ (ఏడీపీ) కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన స్విస్ ఛాలెంజ్ విధానంపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో భాగంగా సింగపూర్ కన్సార్టియంకు కాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ) మధ్య కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అంటూ సీనియర్ అధికారులు మెలిక పెడుతున్నారు. గతంలో ప్రభుత్వాల మధ్య ఎంఓయూలు కుదుర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వంతో అమరావతి డెవలప్‌మెంట్ పాట్నర్‌గా ఉండేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది. ఏపీ ప్రభుత్వంతో సింగపూర్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సింగపూర్ ప్రభుత్వానికి చెందిన కంపెనీలే అమరావతి డెవలప్‌మెంట్ పాట్నర్‌గా ఉండాలి.

Swiss challenge mode caught in new row

కానీ ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వానికి బదులు సింగపూర్‌లోని పలు కంపెనీలు అమరావతి డెవలప్‌మెంట్ పాట్నర్‌గా ఉండేందుకు ఎంఓయూలో కుదుర్చుకునేందుకు ముందుకొస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు వచ్చిన కంపెనీలకు సింగపూర్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకపోవడం విశేషం.

ఈ క్రమంలో సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు సీసీడీఎంసీ మధ్య జరుగుతున్న ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా ఉండాలని మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు చెబుతున్నారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానంలో గ్లోబల్ లెవెల్‌లో బిడ్డింగ్‌కు అనుతించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

దీనిపై ఏపీ ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పీ టక్కర్ కేంద్రం అనుమతి అవసరం లేదని అంటున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో గతంలోనే కేంద్రం అనుమతించిన నేపథ్యంలో మళ్లీ కేంద్రం అనుమతి కోరాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వాల మధ్య ఎంఓయూలు కుదుర్చుకునే సంప్రదాయం ఎప్పటినుంచో ఉందని అందుకు కేంద్రం అనుమతి అవసరం లేదని చెప్పారు.

కేంద్రం అనుమతితోనే అమరావతి అభివృద్ధి జరుగుతోందని అలాంటిది మళ్లీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాగా అమరావతి డెవలప్‌మెంట్ పాట్నర్‌గా ఉండేందుకు ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న అసెండాస్-సింగ్‌బ్రిడ్జి అండ్ సెంబ్‌కార్ప్ సంస్ధలు వంద శాతం సింగపూర్ ప్రభుత్వ సంస్ధలు కాదని అధికారులు చెబుతుండటం విశేషం. అయితే ఆయా కంపెనీల్లో సింగపూర్ ప్రభుత్వానికి కొన్ని షేర్లు ఉన్న మాట వాస్తవమేనని అంటున్నారు.

English summary
The proposed Swiss Challenge mode for the selection of the Amaravati Development Partner (ADP) has stirred new controversy. Officials had said that the central government’s approval would be necessary for the agreement between the Singapore consortium and the Capital City Development and Management Company (CCDMC) on the Swiss challenge method.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X