PNG కనెక్షన్ కావాలా? ఈ నంబర్లకు కాల్ చేస్తే చాలు
గృహావసర గ్యాస్ సిలిండర్ల (LPG) ధరల పెరుగుదల, బుకింగ్ సమయంలో ఎదురయ్యే జాప్యం, డెలివరీ ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యులకు పిఎన్‌జీ (Piped Natural Gas - PNG) ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది. వినియోగదారుల కష్టాలను గుర్తించిన హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (BGL) ద్వారా నేరుగా ఇంటికే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ కనెక్షన్ పొందాలనుకునే వారి కోసం తాజాగా హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది.
సాధారణ ఎల్‌పీజీ సిలిండర్ల వాడకంలో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందోనన్న ఆందోళన ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. కానీ పీఎన్‌జీ కనెక్షన్‌తో ఆ అవసరం ఉండదు. నిరంతరం గ్యాస్ సరఫరా అవుతూనే ఉంటుంది. పైగా ఇది ఎల్‌పీజీ కంటే సురక్షితమైనది. గాలి కంటే తేలికగా ఉండటం వల్ల లీకేజీ జరిగినా ప్రమాద తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, సిలిండర్ల మాదిరిగా ముందుగా డబ్బు చెల్లించాల్సిన పని లేకుండా, వాడుకున్న గ్యాస్‌కు మాత్రమే నెలాఖరున బిల్లు కట్టే సౌలభ్యం ఇందులో ఉంది.

కొత్త కనెక్షన్ కోసం సంప్రదించాల్సిన నంబర్లు:
భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొత్త కనెక్షన్ కోసం ఆసక్తి గల వారు ఈ కింది నంబర్లను సంప్రదించవచ్చు..
హైదరాబాద్ - విజయవాడ:
- ఫోన్ నంబర్: 040-23234701
- వాట్సాప్ నంబర్: 9154313839
కాకినాడ:
- ఫోన్ నంబర్: 0884-2333326
- వాట్సాప్ నంబర్: 9154313848
మారిన ఇంధన సమీకరణాలు..
ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, వాణిజ్య సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో పీఎన్‌జీకి మారడం ఆర్థికంగా కూడా లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు. ఎటువంటి అదనపు డెలివరీ ఛార్జీలు లేకుండా, పారదర్శకమైన రీడింగ్ పద్ధతిలో గ్యాస్ పొందడం వల్ల సామాన్యుడిపై ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. గ్యాస్ కనెక్షన్ పొందాలనుకునే వారు పైన పేర్కొన్న వాట్సాప్ నంబర్ల ద్వారా కేవలం మెసేజ్ పంపి వివరాలు తెలుసుకోవచ్చు.
-
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
ముంచుకొస్తున్న గ్యాస్ సంక్షోభం.. పాత బుకింగ్‌లకే దిక్కులేని పరిస్థితి! -
ఫ్రీ టిఫిన్.. గ్యాస్ కష్టాల్లో అదిరిపోయే ఐడియా -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..














Click it and Unblock the Notifications