Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ లిక్కర్ స్కాం ప్రధాన నిందితుడితో తమన్నా చెట్టా పట్టాల్..? స్పెషల్ ఫ్లైట్‌లో..

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రభుత్వాలు మారినా రాజకీయ కక్ష్యలు మాత్రం మారడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం హయంలో ప్రతిపక్ష నేతలను ఇబ్బందికి గురి చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీములో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును 50 రోజులకు పైగానే జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టింది గత జగన్ ప్రభుత్వం.

ప్రభుత్వం మారడంతో ఇప్పుడు వైసీపీ నేతల వంతు వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలు జైళ్లకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ కీలక నేతలు అరెస్ట్ అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. త్వరలోనే పార్టీ అధినేత , మాజీ సీఎం జగన్ సైతం అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

Tamannaah with the main accused in the AP liquor scam

ఇదిలా ఉంటే లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న వెంకటేశ్ నాయుడుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినీ నటి తమన్నాతో వెంకటేశ్ నాయుడు దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తమన్నాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో దిగిన ఫొటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే వైసీపీ కీలక నేతలతో వెంకయ్య నాయుడు దిగిన ఫొటోలు సైతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

అంతేకాకుండా వెంకటేశ్ నాయుడు విమానాల్లో విలాసవంతంగా గడుపుతున్న వీడియోలు, ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వెంకటేశ్ నాయుడు గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున ఒంగోలు డమ్మీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేసినట్టు వెలుగులోకి వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+