‘చంద్రబాబు మనోడు సార్.. తిట్టొద్దు!’: ‘కమ్మ’ అభిమానిపై తమ్మారెడ్డి ఆసక్తికరం
హైదరాబాద్: గత కొంత కాలంగా ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఇతర పరిణామాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ్మారెడ్డికి ఓ వ్యక్తి నుంచి ఆసక్తికర ప్రతిపాదనలు ఎదురైనట్లు ఆయనే స్వయంగా తెలిపారు.
Recommended Video

'నా ఆలోచన'లో తమ్మారెడ్డి భరధ్వాజ మాట్లాడుతూ.. 'ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద మీరేమైనా పగబట్టారా?' అని ఈ మధ్య కాలంలో ఓ వ్యక్తి తనను ప్రశ్నించారని తెలిపారు.

చంద్రబాబుపై పగబట్టానా?
ఆ వ్యక్తి ప్రశ్నకు తాను ఏ విధంగా స్పందించాననే విషయాన్ని కూడా తమ్మారెడ్డి భరధ్వాజ వెల్లడించారు. ‘చంద్రబాబు నాయుడు మీద నేను పగబట్టడమేంటయ్యా? ఆయన ముఖ్యమంత్రి.. ఆయనతో పోలిస్తే నేనెంత? అల్పుడిని..' అని చెప్పినట్లు తమ్మారెడ్డి తెలిపారు.

వారినీ తిట్టానుగా..
చంద్రబాబును విమర్శిస్తున్నట్లుగా తన పోస్టులన్నీ ఉంటాయని ఆ వ్యక్తి తనతో అన్నారని తమ్మారెడ్డి చెప్పారు. ‘వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తిడుతూ కూడా పోస్టులు చేశాను. మరి, జగన్మోహన్ రెడ్డి మీకు శత్రువా? అని ఎందుకు అడగలేదు?' అని తమ్మారెడ్డి ప్రశ్నించినట్లు తెలిపారు.

నవ్వస్తోందంటూ..
అంతేగాక, ‘ప్రధాని మోడీని తిడుతూ పోస్టులు చేసినప్పుడు అదే ప్రశ్న మీరెందుకు అడగలేదు? ఎవరు తప్పు చేశారనిపిస్తే వారిని ప్రశ్నిస్తాను' అని ఆ వ్యక్తికి సమాధానమిచ్చినట్లు తమ్మారెడ్డి వివరించారు. ‘చివరకు ఆ వ్యక్తి చెప్పిందేమంటే.. ఇటువంటి చెప్పకూడదు.. నాకు నవ్వోస్తోంది కానీ.. చెప్పాల్సి వస్తోంది‘ అని తమ్మారెడ్డి అన్నారు.

‘కమ్మ' అంటూ..
ఆ వ్యక్తి తనతో.. ‘మనోడు సార్ అన్నాడు. మనోడు అంటే ఏంటని అడిగా.. ‘మన కమ్మోళ్లు సార్.. మనోళ్లను మనం ఇలా చేయకూడదు సార్' అని అన్నాడని తమ్మారెడ్డి చెప్పారు. ‘తప్పు చేస్తే తప్పంటాము.. మనోళ్లు అని మీరంటున్నారు కదా.. ఇదే మనోళ్లు నా కోసం ఎప్పుడైనా వచ్చారా?' అని అడిగినట్లు తమ్మారెడ్డి భరద్వాజ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications