పవన్! గుడ్డిగా నమ్మొద్దు, ప్రజల్లోకి వెళ్తేనే తెలుస్తుంది: తమ్మారెడ్డి విమర్శలు
టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు చేశారు.
హైదరాబాద్: టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు చేశారు. రాజకీయాల్లోకి రావడమంటేనే ప్రజల్లోకి రావడమని అన్నారు. ప్రజల్లోకి వస్తేనే సమస్యలపై పోరాటానికి ముందడుగు పడుతుందని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు.

అంతేం ఉండదు..
పవన్ కళ్యాణ్ చెబుతున్న సెక్యూరిటీ కారణాలు ఇంతవరకు ఎప్పుడూ ఎదురుకాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడో ఒకసారి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్తుండటం వల్లే ఎక్కువ మంది ఆయనను చూసేందుకు వస్తున్నారని అన్నారు. అదే పవన్ కళ్యాణ్.. మీ ఊరే వస్తారని తెలిస్తే ఎవరైనా ఇంకో ప్రాంతంలో ఆయనను చూసేందుకు ఎందుకు వెళతారని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

రాజకీయ నాయకుడు ఇలానా?
పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలపాలని ప్రజలు ఎదురుచూస్తున్నప్పుడు, వారి వద్దకు వెళ్లకుండా ఎవరో చెప్పగానే సమస్య తెలిసిపోయిందని అనుకోవడం రాజకీయ నాయకుడి అపరిపక్వత సూచిస్తుందని అన్నారు.

గుడ్డిగా ముందుకెళ్తారా?
భద్రతా ఇబ్బందులు ఎప్పుడైనా ఉంటాయని, వాటిని అధిగమించి ప్రజల్లోకి వెళ్లడమే ఉత్తమమని తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు. తద్వారా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అలా కాకుండా పార్టీ కార్యాలయంలోనే కూర్చుకుని, అనుచరులు చెప్పారని గుడ్డిగా ముందుకెళ్లడం సరికాదని పవన్ కళ్యాణ్‌కు తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు.

గతంలోనూ విమర్శలు
రాజకీయ నాయకుడు సమస్య మూలాల నుంచి తెలుసుకుంటే పరిష్కారాలు వెతకగలడని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా, గతంలోనూ తమ్మారెడ్డి.. పవన్ కళ్యాణ్‌పై పలుమార్లు ఇలాంటి విమర్శలే చేయడం గమనార్హం. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలపై పోరాడాల్సిన పవన్.. ట్వీట్లతోనే సరిపెడుతున్నారని ఎద్దేవా చేశారు.

అలాంటి అభిమానులు ఉంటే ఎంత?
ఒకప్పుడు ఉండే అసలైన ఫ్యాన్స్ ఇప్పుడు లేరని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఒకప్పుడు రాజకీయ నాయకుల అభిమానులైనా, సినీ నటుల అభిమానులైనా తమ అభిమాన నేత లేదా హీరో ఏదైనా చెబితే దానిని జవదాటే వారు కాదని, ఇతరులను జవదాటనిచ్చేవారు కాదని ఆయన చెప్పారు. ఇప్పుడు అలాంటి అభిమానులు లేరని అన్నారు. పవన్ కల్యాణ్ వారిస్తున్నా ఆయనపైబడి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపేవారే ఇప్పుడు అభిమానులని ఆయన తెలిపారు. వారికి తమ అభిమాన హీరో అన్నా, అభిమాన నేత అన్నా గౌరవం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాంటి అభిమానులు ఉంటే ఎంత? ఉండకపోతే ఎంత? అని ఆయన తీవ్రంగా కామెంట్ చేశారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications