మళ్లీ వార్తల్లో నటి తారా చౌదరి, వాచ్‌మన్‌పై ఫిర్యాదు

తన పట్ల వాచ్‌మన్ సుబ్రహ్మణ్యం అసభ్యంగా ప్రవర్తించి, దాడికి యత్నించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనికి తాము నివాసం ఉంటున్న అపార్టుమెంట్ ఎదురుగా ఉండే కిరాణా దుకాణం యజమాని కూడా సహకరిస్తున్నాడని ఆమె ఆరోపించారు.
తారా చౌదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లాకు చెందిన రావెళ్ల రాజేశ్వరి అలియాస్ తారా చౌదరి గతంలో తనను వేధిస్తున్నాడని, తనకు ప్రాణ భయం ఉందని ఓ రాజకీయ నాయకుడిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఓ సినీ రచయిత అవకాశాలు కల్పిస్తానని మోసం చేశాడని కూడా గతంలో ఆమె ఆరోపించారు. ఆ తర్వాత తన తమ్ముడిని కొందరు కిడ్నాప్ చేశారంటూ ఆమె గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications