చంద్రబాబుకు మద్దతుగా ఆ హీరో కొడుకు, కూతురు
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో అరెస్టై రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నారు. ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కొద్దిరోజులుగా నిరసనలు చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, బళ్లారి వంటి ప్రాంతాల్లో.. విదేశాల్లోనూ టీడీపీ సానుభూతి పరులు, ఐటీ ఉద్యోగులు నిరసనలు చేస్తున్నారు.
టీడీపీ కార్యకర్తలు దీక్షలు చేస్తున్నారు. అలాగే వినాయచవితి కావడంతో చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బాబుకు మద్దతుగా దివంగత నందమూరి తారకరత్న పిల్లలు సంఘీభావం తెలియజేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన చంద్రబాబుకు తమ సంఘీభావాన్ని తెలుపుతున్న నందమూరి తారకరత్న పిల్లలు అంటూ టీడీపీ ఆ ఫోటోను ట్వీట్ చేసింది.

పిల్లలిద్దరూ చంద్రబాబుతోనే మేము అంటూ ప్లకార్డుల్ని ప్రదర్శించారు. ఈ ఫోటోపై సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. పిల్లల్ని కూడా రాజకీయాల్లోకి లాగుతారా అంటూ కొందరు అంటుంటే.. తారకరత్న లేకపోయినా ఆయన పిల్లలు ఆ బాధ్యతని తీసుకున్నారు అంటూ మరికొందరు మాట్లాడుతున్నారు. తారకరత్న సతీమణి అలేఖ్య ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతికి పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు న్యాయవాదులు హైకోర్టు తలుపు తట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ తోపాటు మరో మూడు కేసులను నమోదు చేసింది. చంద్రబాబు తనయుడు లోకేష్ ఢిల్లీలో జాతీయ మీడియాకు రాష్ట్రంలోని పరిస్థితిని వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications