తాతపై తారకరత్న అభిమానం: NTR పేరు కలిసేలా ముగ్గురు పిల్లలకు పేర్లు

తాతపై ఉన్న అభిమానంతోనే తారకరత్న ఆయన పిల్లలకు ఎన్టీఆర్ పేరు కలిసేలా పేర్లు పెట్టారు. తారకరత్న, అలేఖ్యారెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

హైదరాబాద్: సినీ నటుడు తారకరత్న మరణం నందమూరి, నారా కుటుంబాల్లోనే గాక, సినీ పరిశ్రమలోనూ విషాదాన్ని నింపింది. శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న కన్నమూశారు. అనంతరం ఆయన పార్థీవదేహాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. కుటుంబసభ్యులు, ప్రముఖులు ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్నారు.

తాత ఎన్టీఆర్ అంటే తారకరత్నకు ఎంతో అభిమానం

తాత ఎన్టీఆర్ అంటే తారకరత్నకు ఎంతో అభిమానం

అందరితో ఎంతో అప్యాయంగా, ప్రేమగా ఉండే తారకరత్న ఇకలేరని అంటే నమ్మలేకపోతున్నామని కుటుంబసభ్యులు, అభిమానులు అంటున్నారు. పెద్దలంటే గౌరవంతోపాటు సినీ ఇండస్ట్రీలో సౌమ్యుడిగా తారకరత్న పేరు తెచ్చుకున్నారు. ఆయనతో పనిచేసిన నటులంతా తారకరత్న మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ.. నందమూరి కుటుంబానికి తారకరత్న ఎప్పుడూ దూరం కాలేదు. ఇక తాత నందమూరి తారక రామారావు అంటే తారకరత్నకు ఎంతో అభిమానం.

ఎన్టీఆర్ పేరు కలిసొచ్చేలా పిల్లలకు తారకరత్న పేర్లు

తాతపై ఉన్న అభిమానంతోనే తారకరత్న ఆయన పిల్లలకు ఎన్టీఆర్ పేరు కలిసేలా పేర్లు పెట్టారు. తారకరత్న, అలేఖ్యారెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తాత ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం ఎన్, తాన్యారామ్‌లో టీ, రేయాలో ఆర్.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న.

తారకరత్నకు కలిసి రాని ‘9’

తారకరత్నకు కలిసి రాని ‘9’


తారకరత్నకు 9 అంకె కలిసి రానట్లే అనిపిస్తోంది. సినీ కెరీర్‌లో మొదట్లోనే ఏకంగా 9 సినిమాలను ఒకే రోజు ప్రారంభించి రికార్డు సృష్టించారు తారకరత్న. అయితే, ఇందులో ఆరు సినిమాలు షూటింగ్‌కు కూడా నోచుకోకపోవడం గమనార్హం. ఇది ఇలావుంటే, జనవరి 27న తారకరత్నకు గుండెపోటు వచ్చి అస్వస్థతంకు గురయ్యారు. ఇది కూడా 2+7=9నే. ఇక తారకరత్న కన్నుమూసిన తేదీ కూడా 18. అంటే 1+8=9 అంకెనే కావడం గమనార్హం.

రేపు మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు

రేపు మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు


తారకరత్న పార్థీవ దేహం ప్రస్తుతం ఆయన నివాసంలోనే ఉంది. ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.చంద్రబాబు నాయుడు, చిరంజీవి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, విజయసాయిరెడ్డి, వైఎస్ షర్మిల తదితరులు తారకరత్నకు నివాళులర్పించారు. సోమవారం ఉదయం 8.45 గంటలకు తారకరత్న పార్థీవదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్‌కి తరలించనున్నారు. సోమవారం సాయంత్రం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+