బాలకృష్ణను చూసి పరుగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్న తారకరత్న కూతురు (వీడియో)
బాలయ్యను చూసిన తారకరత్న కూతురు నిషిక పరుగెత్తుకుంటూ వచ్చి బాలకృష్ణను హత్తుకుంది. ఈ దృశ్యం అక్కడున్నవారి హృదయాలను కదిలించింది.
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణకు తారకరత్న అంటే ఎంతో అభిమానం, ప్రేమ. అలాగే, తారకరత్నకు కూడా బాలయ్య అంటే ఎంతో అభిమానం. బాలకృష్ణను అప్యాయంగా బాల బాబాయ్ అంటూ తారకరత్న పిలుస్తుండేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు లేకపోవడంతో బాలకృష్ణ ఎంతో మనోవేదనకు గురయ్యారు. తారకరత్న పార్థీవదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

బాలయ్యను విషాదంలోకి నెట్టిన తారకరత్న మరణం
తారకత్నకు గుండెపోటు వచ్చినప్పుడు బాలయ్యే దగ్గరుండి అంతా తానై చూసుకున్నారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో కూడా బాలకృష్ణ తారకరత్నతోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యంపై వైద్యులతో సంప్రదింపులు జరిపారు. ప్రత్యేక వైద్య బృందంతో వైద్యాన్ని అందించారు. అయినా, చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. కోలుకుని తిరిగి వస్తాడని అనుకున్నా.. తారకరత్న మరణం బాలయ్యను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.

తారకరత్న పార్థీవ దేహాన్ని చూసి బాలయ్య కన్నీటిపర్యంతం
బాల బాబాయ్ అంటూ అప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా.. అంటూ బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. కాగా, తారకరత్న నివాసంలో ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించేందుకు బాలకృష్ణ ఆదివారం వచ్చారు. బాలయ్య కూడా తారకరత్న పార్థీవదేహం చూసి ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు.
బాలయ్యను పరుగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్న తారకరత్న కూతురు
అప్పటికే తండ్రి మరణంతో రోదిస్తూనే ఉంది తారకరత్న పెద్ద కూతురు నిషిక.
బాలయ్యను చూసిన తారకరత్న కూతురు నిషిక పరుగెత్తుకుంటూ వచ్చి బాలకృష్ణను హత్తుకుంది. ఈ దృశ్యం అక్కడున్నవారి హృదయాలను కదిలించింది. దీంతో బాలకృష్ణ.. ఆ చిన్నారిని ఓదార్చారు. తారకరత్న భార్య, బిడ్డలకు బాలకృష్ణ ధైర్యం చెప్పారు. తారకరత్న శనివారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. ఆయన పార్థీవ దేహాన్ని హైదరాబాద్‌లోని తారకరత్న నివాసానికి తీసుకొచ్చారు. ఆదివారం పలువురు ప్రముఖులు తారకరత్నకు నివాళులర్పించారు. రేపు సాయంత్రం మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications