వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవడ్రా హీరో సినిమా హీరో అరెస్ట్.. 11 ఛీటింగ్ కేసులు!

|
Google Oneindia TeluguNews

మోసాలకు పాల్పడుతున్న ఒక సినీ హీరోను పోలీసులు అరెస్ట్ చేసారు. రుణాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న ఆ హారో పైన ఏకంగా 11 కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో ఎట్టకేలకు ఆయన మోసాలు బయటకు వచ్చాయి. ఎవడ్రా హీరో..చిత్ర హీరో అయిన షేక్ బషీద్ అలియాస్ బాసిత్ ను హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అరెస్ట్ చేసారు. గుంటూరుకు చెందిన మువ్వా గురవయ్య అనే వ్యక్తి రూ.10 కోట్ల రుణం కావాలని సంప్రదించగా రూ.32.50 లక్షలు వసూలు చేశాడు. రుణం మంజూరుపై అడిగిన వీరిద్దరినీ బషీద్‌ బెదిరించాడు. బాధితులిద్దరూ ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు.

రుణాలిప్పిస్తానంటూ మోసం చేస్తూ..
రుణాలిప్పాస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న సినీ నటుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడు గుంటూరు వేజెండ్ల ప్రాంతానికి చెందిన షేక్‌ బషీద్‌ అలియాస్‌ బాసిత్‌. ఎవడ్రా హీరో.. చిత్ర హీరో గా నటించారు. బీకాం చదివిన బషీద్‌ తొలుత గుంటూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. 2008లో హైదరాబాద్‌ వచ్చి ఎస్‌బీకే గ్రూప్‌ పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం, ముంబై, చెన్నై, బెంగళూరు, దుబాయ్‌లలో ఫైనాన్స్‌ సంస్థలను ప్రారంభించాడు.

Task force police arrested Evadra Hero cinemea hero Basith on cheating complaints

చిన్నపాటి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు గ్యారెంటర్‌గా ఉండి రుణం ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడటానికి అలవాటు పడ్డారు. సినీ నిర్మాత గా.., రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా.. నటుడుగా అందరికీ పరిచయం అయ్యాడు. తనకు తాను పరిచయం చేసుకుంలూ మోసాలు మొదలు పెట్టారు.

తాజాగా.. హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన పానకాలరావు అనే వ్యక్తి రూ.15 కోట్ల రుణం కావాలని ఆశ్రయించగా.. అతడి నుంచి బషీద్‌ రూ.65 లక్షలు వసూలు చేశాడు. గుంటూరుకు చెందిన మువ్వా గురవయ్య అనే వ్యక్తి రూ.10 కోట్ల రుణం కావాలని సంప్రదించగా రూ.32.50 లక్షలు వసూలు చేశాడు. రుణం మంజూరుపై అడిగిన వీరిద్దరినీ బషీద్‌ బెదిరించాడు. బాధితులిద్దరూ ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Evadra Hero telugu film Hero Shaik Basid alias Basith arrested by Hyerabad West Zone Task force on cheating complaints.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X