Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ జగన్ కు చెక్, కడప జిల్లా కింగ్ ఎవరు ?, ఆలోచిస్తున్న చంద్రబాబు, పవన్, రేసుగుర్రాలు!!

వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత ఇలాకాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీకి చెక్ పెట్టడానికి కడప ఉమ్మడి జిల్లా నుంచి కూటమి ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవి వస్తుంది ? అని అందరూ ఆకసక్తిగా గమనిస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో మంత్రి పదవి ఆశిస్తున్న టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల్లో అప్పుడే టెన్షన్ మొదలైయ్యింది.

ఉమ్మడి కడప జిల్లాలో ఇటీవల ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన టీడీపీ, బీజేపీ నాయకులు మంత్రి పదవుల కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. కడప అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డప్ప గారి మాధవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కడప నుంచి విజయం సాధించిన తొలి మహిళా ఎమ్మెల్యేగా మాధవి రికార్డు సొంతం చేసుకున్నారు. టీడీపీ కార్యకర్తలకు మాధవి నిత్యం అందుబాటులో ఉంటారని పేరుంది.

TDP and BJP MLAs from Kadapa district who are hoping for ministerial posts in Chandrabu s cabinet

మహిళల కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని మాధవి ధీమాగా ఉన్నారు. వైసీపీ అరాచకాలను ఎండగట్టి కడప రెడ్డెమ్మగా పేరు తెచ్చుకున్న మాధవి భర్త శ్రీనివాసులు రెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేస్తున్నారు. మాధవి మామ రాజగోపాల్ రెడ్డి గతంలో మంత్రిగానే పని చేశారు. శ్రీనివాసులు రెడ్డి భార్యగా మాధవికి కడప జిల్లా టీడీపీలో మంచి పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. మాధవి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు.

ప్రొద్దుటూరులో వైసీపీ మీద సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న టీడీపీ నాయకుడు నంద్యాల వరదరాజులు రెడ్డి అనూహ్యంగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 82 ఏళ్లు వయసు ఉన్న వరదరాజులు రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని, తనకు మంత్రిగా ఒక అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు మనవి చేశారని తెలిసింది. ప్రొద్దుటూరులో వైసీపీ అరాచకాలను ఎండగడుతున్న వరదరాజులు రెడ్డి పోరాటం గురించి చంద్రబాబు నాయుడు ఇటీవల బహిరంగ సభలో మెచ్చుకున్నారు.

వైఎస్ జగన్ అడ్డా పులివెందుల నియోజక వర్గానికి చెందిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి రాయలసీమ పశ్చిమ నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్సీ కోటాలో తనకు మంత్రి పదవి స్తుందని రాంగోపాల్ రెడ్డి ఆశపడుతున్నారు. రాంగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి పులివెందులలో వైఎస్ జగన్ కు, వైసీపీకి చెక్ పెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలిసింది.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మేనమామ, వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేసిన కమలాపురంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కమలాపురం వైసీపీ కంచుకోట, గతంలో కమలాపురం నుంచి పోటీ చేసిన కృష్ణ చైతన్యారెడ్డి తండ్రి పుత్తా నరసింహా రెడ్డి వివిద కారణాలతో ప్రతిసారి ఓడిపోతూ వచ్చారు. ఈసారి పుత్తా నరసింహా రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని, తాను పోటీ చెయ్యనని కృష్ణ చైతన్యారెడ్డి మొండికేశారు. అయితే నారా లోకేష్ జోక్యం చేసుకుని కృష్ణ చైతన్యారెడ్డికి నచ్చ చెప్పి ఆయనతో పోటీ చేయించడంతో ఆయన విజయం సాధించారు. కృష్ణ చైతన్యారెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు.

TDP and BJP MLAs from Kadapa district who are hoping for ministerial posts in Chandrabu s cabinet

టీటీడీ మాజీ చైర్మన్, మైదకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. సుధాకర్ వదిన యనమల దివ్యా తుని నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కూడా సుధాకర్ కు మంత్రి పదవి ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారు. అంతే కాకుండా పుట్టా సుధాకర్ యాదవ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి.

ఇక జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆదినారాయణ రెడ్డి గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ఉమ్మడి కడప జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న ఏకైక నాయకుడు ఆదినారాయణ రెడ్డి. వైసీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి తరువాత బీజేపీలో చేరారు.

కమలాపురం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్, ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కడప జిల్లా నుంచి కూటమి అభ్యర్థులు ఐదు మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో వారితో పాటు పులివెందులకు చెందిన ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి కడప జిల్లా నంచి మంత్రి పదవి ఎవరికి అవకాశం వస్తుందో అని వేచి చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+