HBD YSJagan: జగన్ కు చంద్రబాబు - పవన్ కళ్యాణ్ విషెస్ : టాలీవుడ్ శుభాకాంక్షలు..!!
ముఖ్యమంత్రి జగన్ కు అటు పొలిటికల్- సినీ ఇండస్ట్రీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక గత కొద్ది రోజులుగా సీఎం జగన్ వైసీపీపై నిప్పులు చెరుగుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఉదయం ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా జగన్ కు శభాకాంక్షలు తెలుపుతూ ఆరోగ్యంగా ఉండాలి ఆకాంక్షించారు.
గవర్నర్, తమిళనాడు ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, వ్యాపార - సినీ ప్రముఖులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా నేతలు ముఖ్యమంత్రిని గ్రీట్ చేసారు. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు సీఎంకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేసారు.
విషెస్ చెప్పిన హీరో విశాల్
తెలుగు దేశం అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేసారు. హారో విశాల్ సీఎంకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇప్పటికే సీఎం జగన్ అంటే తనకు ఇష్టమంటూ హీరో విశాల్ ఐ లవ్ జగన్ అని చెప్పుకొచ్చారు.
తాజాగా ముఖ్యమంత్రితో విశాల్ సమావేశం కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడింది. విశాల్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ప్రచారం చేస్తారనే ప్రచారం సినీ - పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
క్యాంప్ ఆఫీసులో తల్లి విజయమ్మ
జగన్ జన్మదినం కావటంతో తాడేపల్లి నివాసంలో తల్లి విజయమ్మ - టీటీడీ ఛైర్మర్ సుబ్బారెడ్డి దంపతులు, సతీమణి భారతి శుభాకాంక్షలు చెప్పారు. సీఎంఓ అధికారులు - మంత్రుల సమక్షంలో సీఎం జగన్ కేక్ కట్ చేసారు. టీటీడీ వేద పండితుల ఆశీర్వచనంతో పాటుగా సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి బాపట్లలో జరిగే కార్యక్రమంలో పాల్గేందుకు వెళ్లారు.
పార్టీ నేతల సమక్షంలో వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఇక, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వాని, ఏపీ మంత్రులు వరుస ట్వీట్లతో జగన్ కు శుభాకాంక్షలు చెప్పారు.
సినీ - జాతీయ ప్రముఖుల విషెస్
తమిళనాడు సీఎంతో సహా పలువురు కేంద్ర మంత్రులు విషెస్ చెప్పారు. టాలీవుడ్ కు చెందిన పులవురు ప్రముఖులు ముఖ్యమంత్రికి విషెస్ చెప్పారు. వైఎస్సార్టీపీ అభిమానులు..టీఆర్ఎస్ - బీఆర్ఎస్ అభిమానులు పలువురు సోషల్ మీడియాలో జగన్ కు విషస్ చెబుతూ పలు పోస్టింగ్ లు పోస్ట్ చేసారు.
సోషల్ మీడియాకు జగన్ కు బర్త్ డే విషెస్ తో హోరెత్తుతోంది. ట్విట్టర్ లో జగన్ బర్త్ డే టాప్ ట్రెండింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications