గుడివాడ టీడీపీ మహానాడు వాయిదా - కారణం అదేనా : కొడాలి నానికి అస్త్రంగా..!!

కొద్ది రోజులుగా గుడివాడ కేంద్రంగా చోటు చేసుకుంటున్న రాజకీయాల్లో మరో ట్విస్టు. వైసీపీ నియోజకవర్గ ప్లీనరీ..అటు టీడీపీ మహానాడుతో గుడివాడ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఈ రోజున వైసీపీ ముందుగా నిర్ణయించిన విధంగా వైసీపీ ప్లీనరీ కొనసాగుతోంది. కానీ, టీడీపీ రేపు నిర్వహించ తలపెట్టిన మహానాడు వాయిదా వేసారు. మరో తేది నిర్ణయిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఇది టీడీపీ పైన విరుచుకుపడే స్థానిక వైసీపీ నేత..మాజీ మంత్రి కొడాలి నానికి అస్త్రంగా మారనుంది.

వైసీపీ ప్లీనరీలో టార్గెట్ టీడీపీ

వైసీపీ ప్లీనరీలో టార్గెట్ టీడీపీ

ప్రస్తుతం జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో అసలు గుడివాడలో కొడాలి నానిని ఓడించటం కాదు..నాని పైన పోటీ చేయటానికి టీడీపీకి అభ్యర్ధే లేరంటూ మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఎంత మంది కలిసి వచ్చినా గెలుపు వైసీపీదే అంటూ ధీమా వ్యక్తం చేసారు.

టీడీపీ పైన రాజకీయంగానే కాకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు - లోకేష్ పైన విరుచుకుపడే కొడాలి నాని పైన చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. అందులో భాగంగా.. గుడివాడ లో మహానాడు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. అక్కడే ఇప్పటి వరకు కొడాలి నాని పైన పార్టీ నేతలే స్పందిస్తూ వచ్చారు.

సడన్ గా వాయిదా నిర్ణయం

సడన్ గా వాయిదా నిర్ణయం

గుడివాడ వేదికగా కొడాలి నానికి టీడీపీ అధినేత గట్టిగా సమాధానం చెప్పబోతున్నారంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ, మహానాడు నిర్వహణ కోసం ఏర్పాట్లు ప్రారంభమైన సమయం నుంచి పార్టీ నేతల మధ్య ఐక్యత కరువైంది. ఫ్లెక్సీల ఏర్పాటు నుంచి సభ నిర్వహణ వరకు విభేదాలు బయట పడ్డాయి. దీంతో..టీడీపీ అధినాయకత్వం వారికి గట్టి సూచనలు చేయాల్సి వచ్చింది. అందరూ కలిసి కట్టుగా మహానాడుకు పని చేయాలని ఆదేశించింది. ఇక, రేపు (బుధవారం) మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు తుది దశకు చేరుకుంది. భారీ వర్షంతో సభా ప్రాంగణం బురదగా మారింది. దీంతో సభ వాయిదా వేస్తూ ఆ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

వర్షం కారణంగా వాయిదా ప్రకటన

వర్షం కారణంగా వాయిదా ప్రకటన


వర్షం కారణంగా మహానాడును వాయిదా వేస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. మరో తేదీని ఖరారు చేయాల్సిందిగా పార్టీ అధినేత ఆదేశించారని సమాచారం. అయితే, కొద్ది రోజుల్లోనే గుడివాడ కేంద్రంగానే మహానాడు జరుగుతుందని జిల్లా టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. గుడివాడకు చంద్రబాబు రానుండటం.. అక్కడ మహానాడు వేదికగా ప్రసంగం ఉండటంతో... ఏం చెబుతారనే ఉత్సుకత పార్టీ శ్రేణుల్లో కనిపించింది. ఇప్పుడు వాయిదా పడటంతో ఎప్పుడు జరిగేది పార్టీ ప్రకటించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+