అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి రెండు ల‌క్ష‌ల కోట్ల ఆస్తి ఇచ్చాం: పాల‌న లేదు..పులివెందుల పంచాయితీలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో కొత్త‌గా అధికారంలోకి వ‌చ్చిన త‌మ‌కు మూడున్నార‌ ల‌క్ష‌ల‌కు పైగా అప్పులు త‌మ‌కు వార‌స‌త్వంగా అప్ప‌గించా ర‌ని చెబుతుంటే...ఇప్పుడు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం తాము జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి రెండు ల‌క్ష‌ల కోట్ల ఆస్తి ఇచ్చామ‌ని చెబుతున్నారు. రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ తీరును త‌ప్పు బ‌ట్టారు. వైసీపీ ప్ర‌భుత్వ తీరు కార‌ణంగా భూముల ధ‌ర‌లు ప‌డిపోయాయ‌ని..అదే విధంగా విమానాలు సైతం ఆగిపోతున్నాయ‌ని వివించారు. పాల‌న తెలియ‌క పోతే..స‌ల‌హాలు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు సూచించారు.

రెండు ల‌క్ష‌ల కోట్ల ఆస్తి ఇచ్చాం..

రెండు ల‌క్ష‌ల కోట్ల ఆస్తి ఇచ్చాం..

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో అవినీతి..అప్పుల గురించి ముఖ్య‌మం త్రి జ‌గ‌న్‌తో స‌హా మంత్రులంతా ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. దీని పైన విచార‌ణ‌ల‌కు సిద్ద‌ప‌డ్డారు. అయితే, ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్య‌మంత్రి చేసిన వ్యాఖ్య‌లు ఈ వ్య‌వ‌హారంలో కొత్త ట‌ర్న్ తీసుకున్నాయి. రాజ‌ధాని ప్రాంతంలో త‌మ ప్ర‌భుత్వ హయాంలో అమరావతిలో రూ.48,500 కోట్ల విలువైన పనులు చేపట్టామని, అయితే వివిధ దశల్లో సాగుతున్న పనులను ఈ ప్రభుత్వం నిలిపివేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల రాజధానిలో రైతుల స్థలా ల ధరలు అమాంతం పడిపోయాయని, స్థిరాస్తి రంగం కుదేలైందని అన్నారు. 54 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం తలపెట్టాం. దానిలో సగం భూమి మౌలిక వసతులకు, రైతులకు స్థలాలకు పోయినా ఇంకా ప్రభుత్వం చేతిలో 25 వేల ఎకరాలుంటుంది. ఎకరం విలువ రూ.7-8 కోట్లు వేసుకున్నా రూ.2 లక్షల కోట్ల ఆస్తి ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికి ఇచ్చిన‌ట్లేన‌ని చెప్పుకొచ్చారు.

రుణం పోయింది..విమానాలు పోయాయి..

రుణం పోయింది..విమానాలు పోయాయి..

రాజ‌ధాని నిర్మాణం కోసం ప్ర‌పంచ బ్యాంకు నుండి రుణం విష‌యంలోనే వైసీపీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు. ఏపీ రాజ‌ధాని కోసం ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకుంటే... 4 శాతం వడ్డీకి వచ్చేద‌ని... 20 ఏళ్ల తర్వాత తీర్చే వెసులు బాటు ఉండేదని వివ‌రించారు. వైసీపీ ప్ర‌భుత్వం అస‌మ‌ర్ద‌త వ‌ల‌నే అదీ రాకుండా పోయిందన్నారు. ఇక‌, త‌మ ప్ర‌భు త్వంలో విమానాల సంఖ్య పెంచేందుకు వ‌యోబుల్ గ్యాప్ కూడా విడుద‌ల చేసామ‌ని..ఇప్పుడు విజయవాడ నుంచి సింగపూర్‌ విమానం రద్దయిందని వివ‌రించారు. విజయవాడ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులు రద్దవుతున్నాయని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేసారు. సింగపూర్‌ విమానంతో పాటు చాలా విమానాలను రద్దు చేశా రని.. ఎక్కడికి వెళ్లాలన్నా మళ్లీ హైదరాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని చంద్రబాబు అన్నారు.

పులివెందుల పంచాయితీలు..

పులివెందుల పంచాయితీలు..

పులివెందుల తరహాలో పంచాయితీలు చేసి ప్రభుత్వ పాలన సాగించలేరని చంద్రబాబు ఫైర్ అయ్యారు. బెదిరింపుల కు దిగడం..దౌర్జన్యాలకు పాల్పడటం వంటి పంచాయితీలు పులివెందులలో జ‌రిగిన‌ట్లుగా..అమరావతి.. ఇతర ప్రాంతా ల్లో కుదరవని హెచ్చ‌రించారు. అసెంబ్లీలోనూ సీఎం జగన్ పులివెందుల పంచాయితీల తరహాలోనే వ్యవహరిస్తున్నార ని దుయ్యబట్టారు. గతంలో బాగా పుంజుకున్న రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు షేర్ మార్కెట్ మాదిరిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాజధాని పరిధిలో వ్యవస్థ అంతా కుదేలవుతోందని, కూలీలకు కూడా పని దొరకడంలేదని చంద్రబాబు విమర్శించారు. పీపీఏలపై స్పందిస్తూ పవన విద్యుత్‌ ధరలు తగ్గించాలని 2018లో పిటిషన్ వేశామని గుర్తుచేశారు. విద్యుత్‌ ధరలు తగ్గించేందుకు తామెంతో కృషి చేస్తే వైకాపా ప్రభుత్వం ఏదేదో మాట్లాడుతోందని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల మీద ముఖ్య‌మంత్రి..వైసీపీ ప్ర‌భుత్వం ఏ ర‌కంగా స్పందిస్తుందో చూడాలి.

English summary
TDP Chief Chandra babu serious comments on CM Jagan and YCP govt. Babu says previous govt hand over the lands value of 2 lakhs cr. Chandra Babu alleged that Jagan failed in Administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X