చంద్రబాబు చేసిన అతి పెద్ద తప్పు అదే..!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో వందల కోట్లు చేతులు మారినట్టు ..దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందనే కారణంతోనే ఆయన్ను అరెస్ట్ చేశామని సీఐడీ అధికారులు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌ను తొలుత పెద్దగా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని కేసు తీవ్రతరం కావడంతో టీడీపీ నాయకులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు.

చంద్రబాబుని బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి టీడీపీ నేతలు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఆయనకు కోర్టుల్లో చుక్కెదురు అవుతోంది. ఆయన అరెస్టై మూడు వారాలు కావొస్తుంది. దీంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా డీలా పడిపోయారు. చంద్రబాబుకు బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అయితే పార్టీని నడింపించే అరెస్ట్ కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురువుతున్నారు. పార్టీ భవిష్యత్తుపై టీడీపీ కార్యకర్తలు కంగారు పడుతున్నారు. చంద్రబాబును సరిగ్గా ఎన్నికల ముందు అరెస్ట్ చేయడంతో.. ఏం చేయాలో పార్టీ నేతలకు పాలుపోవడం లేదు.

chandrababu

నారా లోకేష్‌ను సైతం రేపో మాపో అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే కనుక టీడీపీకి మరో గట్టి దెబ్బ తగిలినట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఒకవేళ లోకేష్‌ కూడా అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు ఉండటం.. పార్టీ అధినేత అరెస్ట్ కావడంతో పార్టీ శ్రేణులకు ఏం చేయాలోతెలియని అయోమయస్థితిలో నిలిపోయారు. ప్రస్తుత పార్టీ పరిస్థితికి చంద్రబాబు కూడా ఓ కారణంగా చెబుతున్నారు. టీడీపీలో చంద్రబాబు తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకులు ఎవరూ కూడా కనిపించడం లేదు.

nara lokesh

చంద్రబాబు కూడా ఆ దిశగా ఆలోచనలు ఎప్పుడు చేసింది లేదు. టీడీపీలో చంద్రబాబుకు సమీకాలికులు చాలామంది ఉన్నప్పటికీ వారందరూ కూడా కేవలం కొంత వరకే చంద్రబాబు పరిమితం చేశారు. సాధారణంగా చంద్రబాబు తన పక్కన ఉన్నవారిని కూడా నమ్మరు. అందుకే ఆయన ఎప్పుడు కూడా పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పగించలేదు.ప్రస్తుత టీడీపీ పరిస్థితికి ఇది కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ ప్రణాళికలన్ని కూడా తలక్రిందులైయ్యాయి. ఇటు వైసీపీ కూడా సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబును అరెస్ట్ చేసి టీడీపీని గట్టి దెబ్బ కొట్టింది.

nara brahmani

చంద్రబాబు తప్పిస్తే..టీడీపీని ముందుకు నడిపించే నాయకుడు ఎవరూ కూడా ఈ పార్టీలో కనిపించడం లేదు. బాలకృష్ణ పార్టీలో ఉన్నప్పటికీ ..ఆయనకు అంతటి సమర్థత ఉన్నట్టు కనపించడం లేదు. సినిమాల్లో డైలాగులు చెప్పినట్టుగా రాజకీయం ఉండదని ఆయన గ్రహించాలని అంటున్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన సైగలు పార్టీని బాగా డ్యామేజ్ చేశాయి. ఎమ్మెల్యే అయి ఉండి..అలా చేయడం కరెక్ట్ కాదని మాటలు వినిపిస్తున్నాయి.

bala krishna

దీంతో నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణినే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటికి పలుమార్లు నారా భువనేశ్వరినే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు పరిస్థితి గురించి వివరిస్తూ..ఆయన మీద సింపతిని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత టీడీపీ గడ్డు పరిస్థితికి చంద్రబాబే కారణం అనే మాటలు తెర మీదకు వస్తున్నాయి. మరి ఈ విషమ పరిస్థితి నుంచి టీడీపీ ఎలా బయటపడుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+