వచ్చేవారం మళ్లీ కుప్పానికి చంద్రబాబు- జనవరి 6 నుంచి మూడు రోజుల టూర్

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈ నెల 6 నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు టీడీపీ వర్గాలు షెడ్యూల్ ను వెల్లడించాయి. ఈసారి టూర్ లో చంద్రబాబు స్ధానిక నేతలతో భేటీ అయి భవిష్యత్ వ్యూహాల్ని రచించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతీ ఏటా సంక్రాంతి సమయంలో సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి 8 వ తేదీ వరకూ ఆయన కుప్పంలో పర్యటించబోతున్నారు. సంక్రాంతికి ముందు నియోజకవర్గంలో పర్యటించి స్ధానికంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు స్ధానికంగా నేతల్ని కలవబోతున్నారు. తాజాగా ఆయన నెల రోజుల క్రితం కుప్పంలో పర్యటించారు. ఇప్పుడు మరోసారి కుప్పానికి వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

tdp chief chandrababu kuppam three day kuppam constituency tour from january 6

Recommended Video

    YSRCP, TDP పై RGV సెటైర్..మధ్యలో ఆయన పై కూడా | Ap Politics || Oneindia Telugu

    తాజాగా కుప్పం మున్సిపల్ ఎన్నికలతో పాటు అంతకముందు జరిగిన పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో టీడీపీ వరుస ఓటములు చవి చూసింది. ఇదే పరిస్ధితి కొనసాగితే భవిష్యత్తులో కుప్పం అసెంబ్లీ సీటు కూడా పోగొట్టుకోవడం ఖాయమని భావిస్తున్న చంద్రబాబు వ్యూహం మార్చారు. తరచుగా స్ధానిక నేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. దీంతోపాటు నిత్యం వారితో టచ్ లో ఉంటూ స్ధానికంగా వ్యూహాల్ని రచిస్తున్నారు. అందుకే చంద్రబాబు మరోసారి కుప్పంలో పర్యటింంచబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి టూర్ లోనూ చంద్రబాబు స్ధానికంగా అందుబాటులో ఉన్న నేతలందరితోనూ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+