అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరా ? చంద్రబాబు విస్మయం- అసలేం జరిగిందంటే ?
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేద విద్యార్ధులకు విదేశీ విద్య అందించేందుకు వీలుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తీసుకొచ్చారు. దీని కింద పేద విద్యార్ధుల్ని ఎంపిక చేసి విదేశాలకు పంపేవారు. దీంతో ప్రభుత్వ సాయం అందుకున్న విద్యార్ధులు విదేశాల్లో నాణ్యమైన విద్యాభ్యాసం చేసేందుకు వీలు కలిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మూలనపడేసిన ఈ పథకాన్ని తాజాగా బయటికి తీసి జగన్ పేరుతో తిరిగి ప్రారంభించారు.
విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారమేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో "అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం" కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించారని చంద్రబాబు గుర్తుచేశారు.

అలాగే "ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ" పథకం కింద బీసీ, మైనారిటీ విధ్యార్థులకైతే రూ.15 లక్షలు... ఈబీసీ, కాపు విద్యార్థులైతే రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారన్నారు. ఈ రకంగా ఐదేళ్ల తెలుగుదేశం హయాంలో మొత్తం 4528 మంది విద్యార్థుల విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించామన్నారు.
మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం... ఇప్పుడు "అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం" పేరు నుంచి అంబేద్కర్ పేరును తొలగించిందని చంద్రబాబు ఆరోపించారు. జగన్ తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరును తొలగించడం ఆయనను అవమానించడమేనన్నారు. అంతేకాదు అంబేద్కర్ ను దైవంగా భావించే వారందరినీ కూడా అవమానించినట్టేనన్నారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరును చేర్చమని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.
-
YS Sharmila : "అవి గొడ్డలి"- జగన్ మావిగాన్ కు షర్మిల షాకింగ్ పంచ్..! -
పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! -
జగన్ పై అటాక్ కు కాదేదీ అనర్హం ? తండ్రి పాదయాత్రనూ వాడేస్తున్న షర్మిల..! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల












Click it and Unblock the Notifications