కమలగెలుపుపై చంద్రబాబు ఆసక్తికరం -అమెరికా 49వ వైస్ ప్రెసిడెంట్ -శాంతి కోరిన వైసీపీ నేత పీవీపీ

చరిత్రలోనే తొలిసారి తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేత ఎవరో తేలిపోయింది. కానీ ఇంకా 11 రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. తుది ఫలితాలు, మెజార్టీ లెక్కలు తేలడానికి మరో నాలుగు రోజులైనా పట్టొచ్చు. అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోబైడెన్ గెలుపు ఖరారైపోగా, ఆయన రన్నింగ్ మేట్, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఆదేశానికి 49వ వైస్ ప్రెసిడెంట్ గా ప్రమాణం చేయడమే తరువాయి. ఈ ఇద్దరి గెలుపుపై..

అభినందనల వెల్లువ..

అభినందనల వెల్లువ..

అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లుగా ఎన్నికైన జోబైడెన్, కమలా హ్యారిస్ కు ప్రపంచ దేశాధినేతలు వరుసగా శుభాభినందనలు పంపుతున్నారు. ఈ ఇద్దరి గెలుపుతో అమెరికా-భారత్ మధ్య సంబంధాలు మరింత బలపడతాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ కూడా విషెస్ చెప్పారు. కాగా, జాతీయ పార్టీ టీడీపీ చీఫ్, జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన చంద్రబాబు సైతం అమెరికా ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర కామెంట్లు చేశారు.

అనుకుంటే ఏదైనా కావొచ్చు..

అనుకుంటే ఏదైనా కావొచ్చు..

‘‘ఒక మహిళ అనుకోవాలేగానీ ఏదైనా సాధించగలదు. అమెరికాకు మొట్టమొదటి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిసే అందుకు ఉదాహరణ. ఆమె చరిత్రాత్మక ఘన విజయం భారతీయ అమెరికన్లకే కాదు, మనందరికీ ఎంతో గర్వకారణం. కంగ్రాట్స్ టు కమల'' అంటూ చంద్రబాబు కీలక సందేశాన్ని ఆదివారం ట్విటర్ ద్వారా తెలిపారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోబైడెన్ ను ఉద్దేశంచి.. ‘‘అతనిది నిర్ణయాత్మక గెలుపు! తన పనిలోనూ బైడెన్ గొప్ప విజయం సాధించాలని కోరుతున్నా''అని చంద్రబాబు పేర్కొన్నారు.

చంద్రబాబు-అమెరికా

చంద్రబాబు-అమెరికా

1994లో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఐటీ విప్లవం ప్రారంభదశలో ఉండటం, తనను తాను పాలకుండిగా కంటే సీఈవోగానే అభివర్ణించుకునే బాబు నాడు అమెరికాకు చెందిన కీలక కంపెనీలను హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టించేందుకు ఒప్పించడం, నాటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ న సైతం హైదరాబాద్ కు తీసుకురావడం, ఐటీ రంగం అభివృద్ధికి సూచికగా నిలిచిన హైటెక్ సిటీని నిర్మించడం తెలిసిందే.

తొలి, రెండో టర్మ్ లో అమెరికా పాలకులు, అక్కడి కంపెనీలతో విస్తృత సంబంధాలు నెరిపిన చంద్రబాబు గత(2014-19) హయాంలో మాత్రం, బహుశా ట్రంప్ వల్ల కావొచ్చు, చైనా, సింగపూర్ కంపెనీలపై మక్కువ చూపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. మళ్లీ ఇప్పుడు బైడెన్-కమల గెలుపుపై టీడీపీ చీఫ్ హర్షం వ్యక్తం చేశారు. ఇకపోతే..

శాంతియుతంగా చేతులు మారాలి..

శాంతియుతంగా చేతులు మారాలి..

అమెరికా ఎన్నికల ఫలితాలపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఒకప్పుడు అమెరికాలో కీలకంగా వ్యవహరించిన వ్యాపార వేత్త, ప్రస్తుత వైసీపీ కీలక నేత పోట్లూరీ వరప్రసాద్ (పీవీపీ) సైతం ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘‘చరిత్ర సృష్టించిన భారతీయ 'కమలం'.. మొట్టమొదటిసారి అమెరికాలో మహిళా నాయకత్వం'' అంటూ కమలా హ్యారిస్ కు అభినందనలు తెలిపారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోబైడెన్ కు, ఆయన టీమ్ కు విషెస్ చెప్పారు. డెమోక్రాట్ల గెలుపును ట్రంప్ తృణీకరిస్తున్నవేళ.. అమెరికా సాధించిన గొప్ప విజయం ద్వారా అక్కడ అధికార మార్పిడి శాంతియుతంగా చేతులు మారాలని పీవీపీ ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+