AP Cabinet Reshuffle: ఆగస్టు 6న ఏపీ కేబినెట్ విస్తరణ ? తేల్చేసిన టీడీపీ..!

ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా కనిపిస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ భేటీలతో పాటు పలు సందర్భాల్లో మంత్రుల వైఖరిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ లో స్ధానం కల్పించాల్సిన పరిస్దితి ఉంది. దీంతో ఆగస్టు 6న కేబినెట్ ప్రక్షాళనకు చంద్రబాబు ముహుర్తం ఖరారు చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇవాళ టీడీపీ స్పందించింది.

రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కేబినెట్లో (AP Cabinet) జూనియర్ మంత్రుల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీనియర్లను పక్కనబెట్టడంతో పార్టీలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో విపక్ష వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేసేందుకు సిద్దమవుతున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా కేబినెట్ ను ప్రక్షాళన చేసి సీనియర్లను తీసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా ఏకంగా 8 మంది మంత్రుల్ని తొలగిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది.

tdp clarified to news on ap cabinet expansion on august 6

ఈ నేపథ్యంలో టీడీపీ ఇవాళ తమ అధికారిక ఫ్యాక్ట్ చెక్ ద్వారా మంత్రివర్గ ప్రక్షాళనపై స్పందించింది. ఆగస్టు 6న మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందన్న ప్రచారాన్ని టీడీపీ ఖండించింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కొంతమంది మంత్రులకు ఉద్వాసన పలికి... ఆ పదవులను వేరే వారికి ఇస్తున్నట్లు వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని టీడీపీ ఫ్యాక్ట్ చెక్ లో పేర్కొంది. దీంతో చంద్రబాబుకు మంత్రివర్గ విస్తరణ చేసే ఉద్దేశం లేదని తేలిపోయింది.

tdp clarified to news on ap cabinet expansion on august 6

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్ధితుల్లో కేబినెట్ ప్రక్షాళనకు చంద్రబాబు సాహసించక పోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ తిరిగి కోలుకునేందుకు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. దీంతో లిక్కర్ స్కాం దర్యాప్తులో వేగం పెంచిన కూటమి సర్కార్ జగన్ కు ఆ అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంది. అదే సమయంలో జగన్ ను అరెస్టు చేస్తారన్న ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున తెరపైకి తెస్తోంది. ఇలాంటి సమయంలో కేబినెట్ ప్రక్షాళన లేదా విస్తరణ పెట్టుకుంటే అందులో అసంతృప్తులు చాలా సులువుగా వైసీపీ తలుపు తట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు ఆ రిస్క్ తీసుకోరనే తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+