ఏపీలో మద్యం పాత బ్రాండ్ల అమ్మకాలు షురూ..!!

ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే జగన్ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలకు కారణ మైన లిక్కర్ పాలసీ రద్దుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం ఇబ్బంది కరంగా మారిన మద్యం అమ్మక విధానం రద్దు చేస్తూ..పొత్త పాలసీ ప్రకటించనున్నారు. దీంతో పాటుగా పాత బ్రాండ్ మద్యం అమ్మకాల ప్రారంభానికి రంగం సిద్దం అవుతోంది.

మద్యం అమ్మకాల్లో మార్పులు
లిక్కర్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పేందుకు ఏపీలో కొత్త ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రస్తుత లిక్కర్ పాలసీ రద్దు దిశగా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత లిక్కర్ పాలసీ పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ మందుబాబుల్లో ఆగ్రహం ఉంది. గతంలో తాము తీసుకునే బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో మందు బాబులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఊరూపేరూ లేని బ్రాండ్లు తెచ్చారంటూ అప్పటి విపక్షనేత చంద్రబాబు కూడా ప్రతి సభలో విమర్శలు చేస్తూ వచ్చారు.

TDP Govt likely to cancel present liquor policy in the state re introduce old brands sale

ప్రస్తుత పాలసీ రద్దు
నాణ్యమైన బ్రాండ్లను... తాము అధికారంలోకి రాగానే అన్ని నాణ్యత కలిగిన బ్రాండ్లను మాత్రమే అందుబాటులో ఉంచుతామని ప్రతి సభలో ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఏపీలో మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్నారు. కొత్త ప్రభుత్వం ఈ విధానం రద్దు చేసి తిరిగి ఆక్షన్ ద్వారా బార్లు, మద్యం దుకాణాలు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనివల్ల మద్యం ద్వారా వచ్చే ఆదాయం భారీగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించిన కసరత్తులు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించినట్లు సమాచారం.

పాత బ్రాండ్ల రీ ఎంట్రీ
ప్రయివేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయానికి పెరగడమే కాకుండా మద్యం రేట్లు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వానికి ముందు అందుబాటులో ఉన్న విధంగానే అన్నిరకాల మద్యం బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత డిస్టలరీలను రద్దు చేస్తూ...తిరిగి కొత్త మద్యం దుకాణాలకు డిపాజిట్ ధరలను నిర్ణయించనున్నారు. గతంలో అమలు చేసిన మద్యం విధానం పైన ఆరోపణలు ఉండటంతో విచారణ చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, కొత్త ప్రభుత్వం వస్తూనే పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావటంతో మందుబాబులకు రిలీఫ్ దక్కనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+