జగన్ సరే: చంద్రబాబుకు పవన్ కళ్యాణే కొరకరాని కొయ్య
విజయవాడ: రాజధాని భూసేకరణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కొరకరాని కొయ్యగా తయారైనట్లు కనిపిస్తున్నరాు. మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌తో సర్దుకుపోవడం ఎలా అనే విషయంపై ఆయనతో పాటు టిడిపి నాయకులు కూడా మథనపడుతున్నట్లు అర్థమవుతోంది.
ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోకపోయినా తెలుగుదేశం పార్టీకి నష్టం లేదు. జగన్‌ను పట్టించుకోకపోవడం వల్ల రాజకీయంగా ఇబ్బంది వచ్చే అవకాశాలు లేవు. అయితే, పవన్ కళ్యాణ్ విషయంలోనే చంద్రబాబుకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు అర్థమవుతోంది.
నదీముఖ గ్రామాల్లో భూముల సేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులకు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. దీన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఒకరిద్దరు మంత్రులు కాస్తా ఘాటుగా స్పందించినా, వెంటనే సర్దుకుపోయే విధంగా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు.

అటు పవన్ కళ్యాణ్‌ను పూర్తిగా వ్యతిరేకించలేక, సర్దుకుని వెళ్లలేక వారు సతమతమవుతున్నట్లు కనిపిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే వారికి పవన్ కళ్యాణ్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. దీంతో వారు మరోమారు పెదవి విప్పేందుకు వారు జంకుతున్నారు. గతంలో ప్రత్యేక హోదాపై ఎంపీల తీరుపై కూడా పవన్ కళ్యాన్ తీవ్రంగా స్పందించారు.
ఆ సమయంలో ఒకరిద్దరు ఎంపీలు గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే పార్టీ నుంచి ఆదేశాలతో నోళ్ల తాళాలు వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి రావడంతో పవన్ వ్యాఖ్యలపై రసవత్తర చర్చ సాగుతోంది. ప్రస్తుతం భూసేకరణపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఎలా స్పందించాలన్న అంశంపై పార్టీ, ప్రభుత్వ పెద్దలు ముమ్మరంగా చర్చిస్తున్నారు.
పవన్ దూకుడుగా ఉన్నా నేతలు మాత్రం సమన్వయం పాటించాలని చంద్రబాబు సూచిస్తుండడం వారికి ఇబ్బందిగానే ఉంది. పవన్ కళ్యాణ్ తదుపరి కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఆధారపడి ఉండవచ్చునని వ్యాఖ్యానిస్తున్నారు.
-
కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్..! -
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
ఆ విషయంలో ఎవరిమాట వినొద్దు అని కలెక్టర్ లకు సీఎం చంద్రబాబు ఆదేశం! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ??











Click it and Unblock the Notifications