టీడీపీ అసలు లెక్క ఇదీ: ఇద్దరి మధ్యా పది సీట్లేనా తేడా : అందుకే పార్టీలో టెన్షన్..!
ఏపీలో విజయం పైనా టీడీపీ..వైసీపీ అధినేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనికి ఎవరి లెక్కలు..అంచనాలు వారికి ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్ పోలింగ్ ముగిసిన రాత్రే తమకు లాండ్ స్లైడ్ విక్టరీ లభిస్తుందని ధీమాగా చెప్పుకొచ్చారు. ఇక, టీడీపీ అధినేత మంత్ర అండర్ కరెంట్ ఉందని..తమకు అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ జరిగిందని అంచనా వేస్తున్నారు. అయితే..టీడీపీ అధినేత వద్ద ఫలితాల పైన స్పష్టమైన అంచనాలు ఉన్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అదే ఇప్పుడు పోలింగ్ ముందు మరింత ఆసక్తి కరంగా మారింది.
టీడీపీ..వైసీపీ మధ్య తేడా పది సీట్లేనా..
ఏపీలో టీడీపీ గెలుస్తుందని చెప్పిన లగడపాటి వైసీపీ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక, ఏపి ఇంటలిజెన్స్ పోలింగ్ నాడు టీడీపీకి 130 సీట్ల వరకు వస్తాయని అంచనాలు వేసింది. ఈ రెండు నివేదికలు టీడీపీలో పోలింగ్ జరిగిన నాటి నుండి ఆశలు పెంచాయి. అయితే, సర్వే సంస్థలు తొలి నుండి వైసీపీకే అనుకూలంగా ఉండటంతో టీడీపీ అగ్ర నాయకత్వం మరోసారి సర్వే చేయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఇంటలిజెన్స్‌తో పాటుగా ఒక ప్రముఖ సర్వే సంస్థను భాగస్వాములను చేసారు. తొలుత 130 సీట్ల వరకు గెలుస్తామని నివేదిక ఇచ్చిన నిఘా అధికారులు తరువాత టీడీపీ గెలుపు ఖాయమని రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మరింత లోతుగా..భిన్న కోణాల్లో చేసిన సర్వేల్లో టీడీపీకి 90 సీట్టు ఖయంగా వస్తాయని..అదే సమయంలో వైసీపీ 80 సీట్ల దాకా గెలుచుకొనే ఛాన్స్ ఉందంటూ తాజా నివేదిక అందచేసినట్లు సమాచారం.

వెయ్యి శాతం అధికారంలోకి వస్తాం..
ఈ లెక్కలను అనేక కోణాల్లో విశ్లేషిస్తున్న టీడీపీ నేతలు తాము అధికారంలోకి రావటం వందకు వెయ్యి శాతం ఖాయమని చెబుతున్నారు. బయటకు 130 సీట్లు అని చెబుతున్నా...లోతైన విశ్లేషణ చేసిన తరువాత 90 సీట్లు ఖాయమని టీడీపీలోని ముఖ్య నేతలు చెబుతున్నారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మేజిక్ ఫిగర్ 88. నిజంగా టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా 90 సీట్లు వస్తే కేవలం రెండు సీట్లు మాత్రమే అధికంగా ఉంటాయి. ఇక, వైసీపీకి అధికారానికి ఎనిమిది సీట్లు మాత్రమే తగ్గుతాయి. ఇదే సమయంలో జనసేన ఎన్ని సీట్లు సాధిస్తుందనేది మరింత ఆసక్తి కరంగా మారింది. నిజంగా టీడీపీ 90 సీట్లు సాధిస్తే..జనసేనకు ఎన్ని సీట్లు వచ్చినా..టీడీపీతోనే కలిసి ఉండే అవకాశం ఉంది. అయితే, వైసీపీ మాత్రం టీడీపీ అంతర్గత చర్చల లెక్కలను కొట్టి పారేస్తుంది. కౌంటింగ్ ప్రారంభమైన సమయం నుండి ఒన్‌సైడెడ్‌గా ఉంటుందని చాలా ధీమాగా కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications