సీట్ల మార్పులో బీజేపీ కొత్త ట్విస్ట్- చంద్రబాబు నిర్ణయం ఏంటి..!!

ఏపీలో ఎన్నికల నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో కూటమిలో సీట్ల మార్పు పైన చర్చలు జరుగుతున్నాయి. దాదాపు 8 సీట్లలో టీడీపీ అభ్యర్దులను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ తో రెండు సీట్ల పైన సర్దుబాటు గురించి మంతనాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో సీట్ల మార్పు పైన బీజేపీ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం పైన చంద్రబాబు తీసుకొనే నిర్ణయం కీలకంగా మారనుంది.

మార్పులు చేర్పులు
టీడీపీ, బీజేపీ సీట్ల మార్పు పైన ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు. అనపర్తి సీటు విషయంలో టీడీపీ పట్టుబడుతోంది. సీటు వదులుకోవటానికి బీజేపీ ససేమిరా అంటోంది. టీడీపీ ప్రకటించిన స్థానంలో బీజేపీ తమ అభ్యర్దిని ప్రకటించటంతో వివాదం మొదలైంది. టీడీపీ అభ్యర్దిగా నల్లిమిల్లి ప్రచారం ప్రారంభించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

TDP Latest Offer for TDP over Anaparthy seat Change Will Chandra Babu agree

దీంతో, నల్లిమిల్లి మద్దతు దారులు ఆందోళనకు దిగారు. మాజీ సైనికుడు శివకృష్ణంరాజుకు కేటాయించిన టికెట్‌ మార్చాల్సిన అవసరమేంటనే టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. రాజమండ్రి ఎంపీగా పురందేశ్వరి పోటీ చేస్తుండటంతో అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్ది పోటీ చేస్తేనే మెజార్టీ దక్కుతుందని భావిస్తున్నారు.

బీజేపీ ప్రతిపాదన
దీంతో, తాజాగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో సమావేశమయ్యారు. పురందేశ్వరి తమ పార్టీ అభ్యర్దిని ప్రకటించటంతో..అక్కడ మార్పు విషయంలో చోటు చేసుకుంటున్న సమస్యలను వివరించారు. నల్లిమిల్లిని బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందుకు నల్లిమిల్లి నో చెప్పారని ఆయన అనుచర వర్గం చెబుతోంది. బీజేపీ ఇప్పటికే టికెట్‌ కేటాయించిన శివకృష్ణంరాజుది ఆర్‌ఎస్‌ఎస్‌ కుటుంబమే.

ఆయన తండ్రి బీజేపీకి పని చేశారు. తన తండ్రి వైద్యం కోసం ఆర్మీకి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుని వచ్చిన శివకృష్ణంరాజు క్రమంగా జిల్లా బీజేపీలో క్రియాశీలకంగా మారారు. 4 సంవత్సరాలుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సంవత్సరకాలంగా అనపర్తి నియోజకవర్గ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు.

TDP Latest Offer for TDP over Anaparthy seat Change Will Chandra Babu agree

సీటు దక్కేదెవరికి
నల్లిమిల్లి బీజేపీలో చేరితే తాము ఆయనకే సీటు ఇస్తామని ఆ పార్టీ నేతల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే, అందుకు నల్లిమిల్లి సిద్దంగా లేనని తేల్చి చెప్పారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తాము ప్రకటించిన అభ్యర్దిని మార్చలేమని చెప్పినట్లు సమాచారం. దీంతో..ఇప్పుడు అనపర్తి విషయంలో చంద్రబాబు ఎలాంటి ప్రత్యాయ్నాయం చూపిస్తారనేది కీలకంగా మారుతోంది.

ఇక..నల్లిమిల్లికి సీటు దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. బీజేపీ అభ్యర్దినే కొనసాగిస్తే నల్లిమిల్లి భవితవ్యం ఏంటనేది నియోజకవర్గం ఫలితం లో కీలకం కానుంది. దీంతో, అనపర్తి సీటు పై తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+