జగన్ వ్యాఖ్యలకు వంశీ భార్య నవ్వుకుంది.. కొడాలి నానీకి అంత భయమా?
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి నేత బుద్ధ వెంకన్న మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పోలీసుల బట్టలు ఊడదీస్తామని చెప్పిన తీరు జగన్ సైకో నైజాన్ని మరోమారు బట్టబయలు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
జగన్ వ్యాఖ్యలు నవ్వు తెప్పించాయి
వల్లభనేని వంశీని కలిసిన జగన్ నందిగం సురేష్ ని ఎందుకు కలవలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇక జగన్ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయని కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ అంటే చంద్రబాబుకు అసూయ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. గుడివాడలో కొడాలి నాని ఒక కొత్త అభ్యర్థి చేతిలో ఓటమిపాలైన సిగ్గు రాలేదా అంటూ మండిపడ్డారు. నిజంగా వంశీ, కొడాలి నానీలను లోపల వేయాలంటే నెల రోజులలోనే జైలుకు పంపే వాళ్ళమని బుద్ధ వెంకన్న వెల్లడించారు.

జగన్ పులివెందులలో కూడా ఓడిపోయే రోజులు వస్తాయి
జగన్ హయాంలో పోలీసులను వాడుకొని టిడిపి నేతలు పైన అక్రమ కేసులు పెట్టించారని ఇప్పుడు అదే పోలీసుల సంగతి చూస్తానని ఆయన బెదిరించడం ఏమిటని మండిపడ్డారు.
ఇక వచ్చే ఎన్నికలలో జగన్ ఓటమి ఖాయమని పులివెందులలో కూడా జగన్ చిత్తుగా ఓడిపోతాడని వెల్లడించారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వల్లే వైసీపీకి నష్టం జరిగిందని స్వయంగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని బుద్ధ వెంకన్న గుర్తు చేశారు.
వంశీని పరామర్శించి జగన్ చరిత్ర హీనుడయ్యారు
ఇక జగన్ చేసిన వ్యాఖ్యలు చూసి వంశీ భార్య కూడా నవ్వుకున్నారని కావాలంటే ఆ వీడియోను తెప్పించుకుని చూడాలని బుద్ధ వెంకన్న తెలిపారు. నిన్న జగన్ తో పాటు అక్కడికి వచ్చిన కొడాలి నాని మళ్లీ వెంటనే వెళ్లిపోయారని, గతంలో సవాళ్లు చేసిన కొడాలి నానికి ఇప్పుడు ఎందుకు అంత భయం అంటూ ప్రశ్నించారు. వల్లభనేని వంశీని పరామర్శించి జగన్ చరిత్ర హీనుడిగా మిగిలాడని బుద్ధ వెంకన్న పేర్కొన్నారు.
వారంతా జైలుకు వెళ్ళక తప్పదు
కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ల బూతుల గురించి జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని, అంతేతప్ప ప్రజలందరూ అసహ్యించుకునేలా మాట్లాడే వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారికి మద్దతుగా మాట్లాడవద్దని హితవు పలికారు. గతంలో అధికార మదంతో నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్లంతా జైలుకు వెళ్లక తప్పదని బుద్ధ వెంకన్న పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications