Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీ కులం వాళ్లతో ఛీ కొట్టించుకున్నారు..!!

వైసిపి నేతల వ్యాఖ్యలపై టిడిపి నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. పేర్ని నాని, అమర్‌నాథ్ మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తప్పుడు కేసులతో చంద్రబాబును జగన్‌ జైలుకు పంపించారని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అప్పుడు యావత్‌ దేశంతో పాటు విదేశాల్లో స్థిరపడిన వారు కూడా బాబుకు మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. వైసీపీ చేసిన పిచ్చి పనులకు ప్రజలు వారిని తరిమికొట్టారని అన్నారు.

బుద్దా వ్యాఖ్యలు
వైసీపీ నేతల పై బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేసారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా చంద్రబాబు మారిస్తే.. అప్పుల రాష్ట్రంగా జగన్‌ మార్చారని ధ్వజమెత్తారు. ఆరడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అని అన్నారు. ఐదు అడుగుల తాచుపాము జగన్‌ అంటూ ఎద్దేవా చేశారు. ఈ తాచుపాముకు తన మన బేధం లేదని.. ఎవరినైనా కాటేస్తాడని విమర్శించారు. వైయస్, జగన్ లు ఎన్ని విచారణ లు చేసినా చంద్రబాబు తప్పు చూపలేకపోయారని చెప్పుకొచ్చారు. మీరు చేసిన పిచ్చి పనులకు ప్రజలు మిమ్మలను తరిమి కొట్టారని వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

TDP Leader Budha Venkanna made interesting comments against Perni Nani

మాయ చేయాలని
ఇంకా అబద్దాలు తో‌ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారన్నారు. పేర్ని నాని నీ కపట మాటలు మానుకుని బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. నెల రోజుల్లో నే రాష్ట్రం లోమార్పు తెచ్చిన మనిషి చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. అధికారులతో సమీక్ష చేసి, శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారపి..జగన్ ఐదేళ్లల్లో ఎప్పుడు అయినా అధికారులతో ఇలా మాట్లాడారా అని ప్రశ్నించారు. కమీషన్ లు, కాంట్రాక్టులలో మామూళ్ల కోసం జగన్ మీటింగ్ లు పెట్టారన్నారు. వైసిపి లో జగన్ నుంచి కిందిస్తాయి వరకు అందరకీ పదవీ కాంక్షతో బతుకుతున్నారని వ్యాఖ్యానించారు.

పవన్ పై నోరు పారేసుకొని
పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుని మీ కులం వాళ్లతో ఛీ కొట్టించుకున్నారంటూ బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేసారు. మీ జగన్ ను చూసి పారిశ్రామిక వేత్త లు‌ భయంలొ వెళ్లిపోయారని విమర్శించారు. కియా, అమర్ రాజా కంపెనీ విషయంలో వాటాలు అడగలేదా అని నిలదీసారు. భోగాపురం పనుల్లో పర్సంటేజీలు అడగలేదా అని ప్రశ్నించారు. మా సిఎం సంయమనం పాటించాలని మమ్మలను ఆపారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ అమలు చేస్తారని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+