Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hanuma Vihari: హనుమ విహారికి నారా లోకేష్ బంపర్ ఆఫర్..! రెండే నెలల్లో..

ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్ హనుమ విహారి అవమానకర పరిస్ధితుల్లో జట్టును, కెప్టెన్సీని వీడటం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. తిరుపతి వైసీపీ కార్పోరేటర్ కుమారుడైన పృధ్వీరాజ్ ను దూషించాడన్న కారణంతో బలవంతంగా విహారితో రాజీనామా చేయించిన వ్యవహారంలో ఇప్పుడు విహారికి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ఆంధ్రా జట్టులో ఆటగాళ్లంతా విహారినే తమకు కెప్టెన్ గా ఉండాలంటూ మద్దతుగా ఏసీఏకు లేఖ రాయగా.. ఇప్పుడు టీడీపీ యువ నేత నారా లోకేష్ విహారికి మరో ఆఫర్ ఇచ్చాడు.

అధికార పార్టీ రాజకీయ జోక్యం కారణంగా ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి అవమానకర నిష్కృమణ తనకు ఆశ్చర్యం కలిగించిందంటూ నారా లోకేష్ ఇవాళ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఆంధ్రా క్రికెట్ కు తిరిగి విహారిని ఆహ్వానిస్తున్నానంటూ లోకేష్ పేర్కొన్నారు. రెండు నెలల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడేందుకు తిరిగి రావాలని కోరారు. తాము అతనికి, జట్టుకు రెడ్ కార్పెట్ పరుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అలాగే వచ్చేసారి రంజీ ట్రోఫీని గెలవడానికి అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తామని ఆఫర్ చేశారు.

tdp leader nara lokesh bumper offer to former andhra cricket captain hanuma vihari

రెండు నెలల్లో జరిగే ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు విహారిని తిరిగి ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆహ్వానించి తిరిగి యథాస్ధానం అప్పగించి వచ్చే సారి రంజీ ట్రోఫీ గెలిచేందుకు సాయం చేస్తామని లోకేష్ ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. హనుమ విహారికి మద్దతుగా ఇప్పటికే క్రికెట్ వర్గాలు, టీమిండియాలో మాజీ సహచరులు కూడా స్పందిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా మద్దతు పెరుగుతుండటం విశేషం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+