Nara Lokesh : ప్రైవేటు స్కూళ్లకు నారా లోకేష్ మూడు కీలక హామీలు .. !
వైసీపీ ప్రభుత్వంలో ప్రైవేటు స్కూళ్లు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేష్ ను యాజమాన్యాల ప్రతినిధులు ఇవాళ కలిశారు. వారికి లోకేష్ మూడు కీలక హామీలిచ్చారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాసంస్కరణల పేరుతో పలు చర్యలు తీసుకుంటోంది. దీంతో పాటే ప్రైవేటు స్కూళ్లకు బదులుగా విద్యార్ధుల్ని ప్రభుత్వ స్కూళ్లకు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో ప్రైవేటు స్కూళ్లపై ఉక్కుపాదం మోపుతోంది. దీంతో యాజమాన్యాలు గగ్గోలుపెడుతున్నాయి. వీరంతా ఇవాళ యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ను కలిశారు. తమ సమస్యలు విన్నవించుకున్నారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో పాల్గొంటున్న టీడీపీ యువనేత నారా లోకేష్ ను ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల ప్రతినిధులు కలిశారు. గత టీడీపీ హయాంలో ప్రైవేట్ విద్యా సంస్థల అనుమతుల పునరుద్దరణ 10 ఏళ్లకు ఒక సారి జరిగేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 3 ఏళ్లకు ఒకసారి అనుమతులు రెన్యువల్ చేసుకోవాలని నిబంధన పెట్టారని వారు లోకేష్ కు తెలిపారు. దీంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగాల్సి వస్తుందన్నారు.

అలాగే ప్రతీ స్కూలుకూ అగ్నిమాపకశాఖ అనుమతుల పేరుతో వేధిస్తున్నారంటూ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల ప్రతినిధులు లోకేష్ కు ఫిర్యాదు చేశారు. అలాగే ప్రైవేటు విద్యాసంస్థలకు విద్యుత్ బిల్లుల స్లాబ్ ను 2 నుండి 7కి మార్చాలని కోరారు. దీనిపై స్పందించిన లోకేష్ వారికి ఆయా అంశాలపై హామీలిచ్చారు. వైసీపీ అధికారంలోకి విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందన్న లోకేష్.. జె-ట్యాక్స్ కోసం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు వేధింపులకు గురిచేస్తోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదేళ్లకోసారి రెన్యువల్ విధానాన్ని పునరుద్దరిస్తామని లోకేష్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అలాగే ఫైర్ ఎన్ ఓసి, ఇతర సాకులతో జరుగుతున్న వేధింపులు లేకుండా చేస్తామన్నారు. విద్యుత్ బిల్లుల అంశాన్ని పరిశీలించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications