పవన్ ను గెలిపించిన వర్మకు ఎమ్మెల్సీ ఖరారైనట్లేనా ? స్వయంగా ట్వీట్..!

ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే తెరపైకి వచ్చిన పేరు ఎస్వీఎస్ఎన్ వర్మ. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయిన ఎస్వీఎస్ఎన్ వర్మ అధినేత చంద్రబాబు మాటకు కట్టుబడి తన సీటును త్యాగం చేసి మరీ పవన్ కళ్యాణ్ ను ఎన్నికల్లో గెలిపించేందుకు కష్టపడ్డారు. పవన్ ను గెలిపిస్తే కూటమి ప్రభుత్వంలో తొలి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వర్మ ఎమ్మెల్సీ పదవి తెరపైకి వస్తోంది.

త్వరలో శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా వర్మతో పాటు మరికొందరు పేర్లను పరిశీలిస్తున్నారు. వచ్చే నెలలో జరిగే రెండు ఎమ్మెల్సీ సీట్ల ఉపఎన్నికలో వర్మకు కచ్చితంగా అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఆయన కూడా ఇదే ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పటివరకూ ఈ విషయంపై ఎక్కడా బయటపడని వర్మ ఇవాళ మాత్రం ట్వీట్ చేశారు.

tdp leader varma tweet on mlc post as per Chandrababu s promise

పవన్ కళ్యాణ్ గారి గెలుపులో అన్ని తానే ముందుండి నడిపించిన వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి? అంటూ ఆయన స్వయంగా ట్వీట్ పెట్టుకున్నారు. ఓ టీవీ ఛానల్లో ఈ మేరకు వచ్చిన వార్తా కథనాన్ని దీనికి జత చేశారు. తద్వారా తనకు ఎమ్మెల్సీ పదవి ఖరారైందన్న సంకేతాలను వర్మ ఇచ్చేశారు. దీంతో చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పవన్ గెలుపుకు కారణమైన వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+