విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపి ఎంపి జివిఎల్ పై కొనసాగుతున్న టిడిపి నేతల మాటల దాడి:తప్పుదోవ పట్టిస్తున్నాడు!

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ:ఎపి లోని టిడిపి ప్రభుత్వం పీడీ అకౌంట్స్ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపించిన బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావుపై టిడిపి నేతల ఎదురుదాడి కొనసాగుతోంది.

ఎంపీ జీవీఎల్‌ ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎంపి తోట నరసింహం మండిపడగా...అతడో అవినీతి చక్రవర్తి అని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. మరోవైపు అసలు పిడి అకౌంట్లు ఎవరి వ్యక్తిగత అకౌంట్లు కావని, అవి ప్రభుత్వానివేనని ఏపీ ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిచంద్ర వివరణ ఇచ్చారు.

 TDP leaders continueing war of words over BJP MP GVL

ఎపి ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావుకు ఆధార్‌ కార్డు ఢిల్లీలోనే ఉందని టిడిపి ఎంపీ తోట నరసింహం దుయ్యబట్టారు. అసలు జీవీఎల్‌ ఎవరో కూడా తెలుగువారికి తెలియదన్నారు. ఏపీపై కేంద్రం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీకి బీజేపీ న్యాయం చేయకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని తోట నరసింహం హెచ్చరించారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై సభ లోపల, బయట పోరాడుతామని ఎంపీ తోట నరసింహం స్పష్టం చేశారు.

ట్రెజరీ చుట్టూ తిరగకుండా కొన్ని నిధులను ఆయా శాఖల అకౌంట్లలో ఉంచుతారని చెప్పారు. విభజన తర్వాత ఏపీకి 43,374, తెలంగాణకు 29,236 పీడీ అకౌంట్లు తెరిచారని వెల్లడించారు. 13,14వ ఆర్థిక సంఘం నిధులను వేరు చేసేందుకు 13,199 అకౌంట్లు తెరిచామని, నిధులు ట్రెజరీలో కాకుండా బ్యాంకులో ఉంచడం వల్ల దుర్వినియోగమవుతాయన్నారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తూ నిధులను ట్రెజరీలో ఉంచుతున్నామని, ఏపీ నమూనానే చాలా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏపీ పీడీ అకౌంట్లపై కాగ్ అభ్యంతరాలు తప్పని రవిచంద్ర
కొట్టిపారేశారు.

విజయవాడ: ఏపీకి రావాల్సిన వాటిపై సభ లోపల, బయట పోరాడుతామని ఎంపీ తోట నరసింహం చెప్పారు. ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీపై కక్ష గట్టినట్లు కేంద్రం వ్యవహరిస్తోందని, జీవీఎల్‌కు ఆధార్‌ కార్డు ఢిల్లీలోనే ఉందని ఎద్దేవాచేశారు. జీవీఎల్‌ ఎవరో కూడా తెలుగువారికి తెలియదని, ఏపీకి బీజేపీ న్యాయం చేయకపోతే కాంగ్రెస్‌ గతే పడుతుందని నరసింహం హెచ్చరించారు.

మరోవైపు పీడీ అకౌంట్స్ అనేవి ఎవరి వ్యక్తిగత అకౌంట్లు కాదని... అవి ప్రభుత్వానివేనని ఏపీ ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిచంద్ర తేల్చిచెప్పారు. ప్రతి పని కోసం ట్రెజరీ చుట్టూ తిరగకుండా కొన్ని నిధులను ఆయా శాఖల అకౌంట్లలో ఉంచుతారని ఆయన వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 43,374, తెలంగాణకు 29,236 పీడీ అకౌంట్లు ఉన్నాయన్నారు. 13, 14వ ఆర్థిక సంఘం నిధులను వేరు చేసేందుకు మరో 13,199 అకౌంట్లు తెరిచామని రవిచంద్ర వెల్లడించారు.

నిధులు ట్రెజరీలో కాకుండా బ్యాంకులో ఉంచడం వల్ల దుర్వినియోగం అవుతాయనే ఉద్దేశ్యంతోనే కేంద్రం మార్గదర్శకాలను అనుసరిస్తూ నిధులను ట్రెజరీలో ఉంచుతున్నట్లుగా రవిచంద్ర తెలిపారు. ఈ క్రమంలో ఏపీ నమూనానే చాలా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని చెప్పారు. ఏపీ పీడీ అకౌంట్లపై కాగ్ అభ్యంతరాలు సరికాదని రవిచంద్ర స్పష్టం చేశారు.

అంతకుముందు విజయవాడలో టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ బిజెపి ఎంపీ జీవీఎల్‌ అవినీతిలో చక్రవర్తి అని ఆరోపించారు. ఆయన వందల కోట్లు ఎలా సంపాదించారో తాను సాక్ష్యాధారాలతో సహా వెల్లడిస్తానని బుద్దా వెంకన్నచెప్పారు. జివిఎల్ కు ధైర్యం ఉంటే అతడి అక్రమ సంపాదనపై బహిరంగ చర్చకు రావాలని బుద్దా వెంకన్న సవాల్‌ విసిరారు. భాజపా, వైకాపా రెండు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని బుద్దా ఆరోపించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక విషయంలో మరోసారి వారివురి లోపాయకారి ఒప్పందం బయట పడిందని దుయ్యబట్టారు.

English summary
Vijayawada: TDP leaders continue war of words on BJP MP GVL Narasimha Rao over his PD Accounts alligations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X