వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో సుజన చక్రం, ఐనా జగన్‌ను పట్టలేదు: బాబుపై అసహనం

టిడిపి జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ పాత ధోరణిలోనే వెళ్తున్నారన్న అసంతృప్తి శ్రేణుల్లో పెరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

అమరావతి: టిడిపి జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ పాత ధోరణిలోనే వెళ్తున్నారన్న అసంతృప్తి శ్రేణుల్లో పెరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

గతంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికే ప్రాధాన్యం ఇచ్చి, పార్టీని పట్టించుకోని కారణంగా ఎదురైన చేదు ఫలితాలను వారు గుర్తు చేస్తున్నారు.

ప్రభుత్వం అమలుచేస్తోన్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతో పాలనకే ఎక్కువ సమయం కేటాయిస్తున్న చంద్రబాబు.. కీలకమైన పార్టీ వ్యవస్థాగత అంశాలపై దృష్టి సారించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

అధ్యక్ష ఎన్నికలు వాయిదా

అధ్యక్ష ఎన్నికలు వాయిదా

మహానాడు ముగిసే ముందునాటికే పార్టీకి ప్రతిష్ఠాత్మకమైన సంస్థాగత ఎన్నికలు పూర్తవగా, ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో జిల్లా పార్టీ అధ్యక్షులను ప్రకటించక పోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. విభేదాలున్న జిల్లాలతో పాటు, ఏకాభిప్రాయం ఉన్న జిల్లాల అధ్యక్షుల ప్రకటననూ వాయిదా వేయడాన్ని నేతలు ప్రస్తావిస్తున్నారు.

చిత్తూరు, కర్నూలు, కృష్ణా, ప్రకాశం, విశాఖ రూరల్‌వంటి జిల్లాల్లో పోటీ ఎక్కువగా ఉందన్న కారణంతో అక్కడ ప్రకటనను వాయిదా వేసిన నాయకత్వం, పోటీలేని జిల్లా అధ్యక్షుల ప్రకటననూ వాయిదా వేయడంపై అసహనం వ్యక్తమవుతోందంటున్నారు.

వీటికి సమయం కేటాయించడం లేదని..

వీటికి సమయం కేటాయించడం లేదని..

మహానాడు, తర్వాత నవ నిర్మాణదీక్ష, మళ్లీ దానిపై సమీక్షలతోపాటు, రోజూ ప్రభుత్వ శాఖలపై చంద్రబాబు నాలుగైదు సమీక్షలు నిర్వహిస్తోన్నారు. సంస్థాగత సమస్యలు, అంశాలపై మాత్రం ఎక్కువ సమయం కేటాయించటం లేదంటున్నారు. రాష్ట్రంలో మిగిలిపోయిన మార్కెట్ యార్డులు, దేవాలయ పాలక మండళ్ల ఖాళీలను కూడా భర్తీ చేయాల్సి ఉందని చెబుతున్నారు.

అన్నీ పెండింగులోనే..

అన్నీ పెండింగులోనే..

దాంతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కూడా వాయిదా పడుతోందని గుర్తు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీసీలే అధ్యక్షులుగా ఉన్నందున, ఏపీలో దళితుడికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, అది ఇంకా కార్యరూపం దాల్చడం లేదంటున్నారు. అదేవిధంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టిటిడి పాలకవర్గం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి, శాప్, 20 సూత్రాల అమలు కార్పొరేషన్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి మరికొన్ని నామినేటెడ్ పదవులు కూడా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అధికార ప్రతినిధి లేకపోవడం..

అధికార ప్రతినిధి లేకపోవడం..

పార్టీకి పని చేసిన న్యాయవాదులు పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవులు ఆశిస్తున్నారని, ఆ జాబితా కూడా పెండింగ్‌లోనే ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో అధికార ప్రతినిధి లేకపోవడం వల్ల కేంద్రంలో ప్రభుత్వపరంగా, రాజకీయపరంగా జరుగుతున్న పరిణామాలను తెలుసుకోవడంలో విఫలమవుతున్నారంటున్నారు.

మోడీని జగన్ కలవడాన్ని పసిగట్టలేదు.. సుజన వల్లే

మోడీని జగన్ కలవడాన్ని పసిగట్టలేదు.. సుజన వల్లే

ఇటీవల వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన విషయం ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కేంద్రమంత్రి సుజనా చౌదరితోపాటు, అక్కడున్న ఎవరూ పసిగట్ట లేకపోయారని గుర్తు చేస్తున్నారు. సుజనాకు అనుకూలంగా ఉండేవారే ఢిల్లీలో కొనసాగుతున్న పరిస్థితి ఉందని, ఆయనకు నచ్చనివారు ఢిల్లీకి వెళ్లే అవకాశం లేదంటున్నారు. కీలకమైన ప్రభుత్వ అధికార ప్రతినిధి నియామకం వాయిదా వేస్తున్న తీరును బట్టి, నాయకత్వం కూడా సుజనానే ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందంటున్నారు.

పదవులిచ్చినా...

పదవులిచ్చినా...

ఈ విషయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. నాయకత్వంలో వేరే ఆలోచనలు ఉండటమే కారణమని కూడా అంటున్నారు. ఎన్ని పదవులిచ్చినా పదవులు తీసుకున్న నేతలు ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకువెళ్లడం లేదని, అందుకే దానిపై చంద్రబాబు అంతగా శ్రద్ధ చూపించడం లేదని పార్టీ కార్యాలయ వర్గాలు వివరిస్తున్నారు. ప్రధాని మోడీ మూడేళ్లలో ఎలాంటి పదవులివ్వని విషయాన్ని గుర్తు చేస్తూ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని పదవులిచ్చిన ఘనత తమ పార్టీదే అయినా, పదవులు తీసుకున్న నేతలు పథకాలపై ఓనర్‌షిప్ తీసుకుని పనిచేయటం లేదన్న అసంతృప్తి అధినాయకత్వంలో ఉందంటున్నారు. చాలామందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినా వారిలో పనితనం ప్రదర్శిస్తున్న వారి సంఖ్య తక్కువేనని, వర్ల రామయ్య, పంచుమర్తి అనూరాధ, డొక్కా మాణిక్యవరప్రసాద్ మాత్రమే చురుకుగా పని చేస్తున్నారని అంటున్నారు.

English summary
Telugudesam party leaders unhappy with AP CM Chandrababu Naidu and Sujana Choudhary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X