నేడు సభలో మరోమారు బ్యాడ్ మార్నింగ్ అన్న టీడీపీ సభ్యులు .. మళ్ళీ కౌంటరేసిన స్పీకర్

వెలగపూడిలో ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నేడు రెండో రోజు కొనసాగుతున్నాయి. నేడు కూడా సభలోకి స్పీకర్ వచ్చిన తర్వాత ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సభలోకి వచ్చిన సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాంను ఉద్దేశించి టీడీపీ సభ్యులు చేసిన విష్ కు నేడు కూడా కౌంటర్ పడింది .

సభలోకి ప్రవేశించిన స్పీకర్ తమ్మినేని సీతారాం సభ్యులను ఉద్దేశించి గుడ్‌మార్నింగ్ అని చెప్పారు. వెంటనే రాజధాని తరలింపునకు నిరసనగా టీడీపీ సభ్యులు స్పీకర్‌కు బ్యాడ్ మార్నింగ్ అంటూ బదులిచ్చారు. అందుకు స్పందించిన స్పీకర్ ఈ రోజు కూడా టీడీపీ సభ్యులకు కౌంటర్ ఇచ్చారు. తమ సీఎం ఎప్పుడూ చెబుతుంటారని కుక్క తోక ఎప్పుడూ వంకరేనని ఆయన వ్యాఖలు చేశారు. అంతేకాదు.. ఎవరైనా తెల్లవారి లేచి శుభోదయం అంటారని లేకపోతే గుడ్‌మార్నింగ్ అంటారని స్పీకర్ వ్యాఖ్యానించారు. మీ కర్మది.. బ్యాడ్‌మార్నింగ్ అని టీడీపీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ బదులిచ్చారు.

TDP members said today also Bad Morning in the House .. again Speaker countered tdp leaders

నిన్నటికి నిన్న కూడా అసెంబ్లీ ప్రారంభంలో కూడా స్పీకర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సభలోకి ఎంటర్ అయిన స్పీకర్ తమ్మినేని తన సీట్లో కూర్చోబోతుండగా బ్యాడ్ మార్నింగ్ సార్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనకు వెల్కమ్ చెప్పారు. దీనిపై స్పందించిన స్పీకర్ ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పి మంచి జరగాలని కోరుకుంటారని కానీ బ్యాడ్ మార్నింగ్ చెప్పేవారి గురించి ఏం మాట్లాడగలమంటూ స్పీకర్ సెటైర్లు వేశారు . ఇక నేడు సైతం టీడీపీ నేతలు బ్యాడ్ మార్నింగ్ అని చెప్పటంతో కుక్క తోక వంకర అని కౌంటర్ ఇచ్చారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+