హిందూపురంలో బాలకృష్ణ సందడి
స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో అనంతపురం జిల్లా హిందూపురాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ వేరుగా అన్నారు. హిందూపురం పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హిందూపురం సమీపంలోని గుడ్డం రంగనాథస్వామి దేవాలయంలో కోనేరు అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఛైర్మన్ మోహన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడారు. హిందూపురంను నందమూరిపురంగా అభివర్ణించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.












Click it and Unblock the Notifications