కృష్ణా జిల్లా పేరు మార్చాల్సిందే...! టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్..!

ఏపీలో కూటమి సర్కార్ తాజాగా జిల్లాల పునర్ విభజన చేపట్టింది. గత వైసీపీ హయాంలో జరిగిన జిల్లాల పునర్ విభజన సరిగ్గా లేదని ఆరోపిస్తున్న కూటమి సర్కార్.. మంత్రుల కమిటీని నియమించి అధ్యయనం చేయించింది. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు జిల్లాల సరిహద్దుల్ని మార్చింది. కొత్తగా మూడు జిల్లాల్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేసింది. అయినా ఇంకా సమస్య తీరలేదు.

పలు జిల్లాల పేర్లతో పాటు సరిహద్దుల్లో మార్పులు చేయాలనే డిమాండ్లు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే కృష్ణాజిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలు నూజివీడు, గన్నవరం, పెనమలూరును విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే పెనమలూరు మార్పుపై స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అభ్యంతరాలతో సీఎం చంద్రబాబు ఏకంగా ఈ మార్పుల్ని వాయిదా వేసేశారు.

tdp mla bonda uma demands kapu leader vangaveeti ranga name to krishna district

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మరో కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. కృష్ణాజిల్లాకు కాపు నేత వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆయన ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ జింఖానా గ్రౌండ్స్ వేదికగా జరిగిన కాపునాడు స్వరోత్సవం కార్యక్రమంలో కాపులకు ఒక జిల్లా పెట్టాలని ఆయన కోరారు. కాపువీరుడు వంగవీటి రంగా పేరు కృష్ణా జిల్లా కి పెట్టాలని బోండా ఉమ ప్రభుత్వాన్ని కోరారు.

త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకుని తన డిమాండ్ వినిపిస్తానని కాపు నేతలకు బోండా ఉమ హామీ కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం కృష్ణాజిల్లాలో ఉన్న వివాదాలకు తోడు ఈ జిల్లా పేరు మార్పు డిమాండ్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి. గతంలో వైసీపీ హయాంలోనూ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఏదో ఒక దానికి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ వచ్చింది. అయినా జగన్ సర్కార్ అప్పట్లో ఈ తేనెతుట్టెను కదపడం ఎందుకని వదిలేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+