భగవద్గీత అమ్మకాల్ని అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యే మాధవి-బీజేపీ ఉపాధ్యక్షుడి ఫైర్..

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందులో భాగస్వాములైన టీడీపీ-జనసేన కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా, బీజేపీ మాత్రం చాలా కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే విశాఖ బీజేపీ నేతలు తమ పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటోల్ని అధికారిక కార్యక్రమాల్లో పెట్టకపోవడంపై మండిపడుతూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఇదే క్రమంలో తాజాగా ఓ టీడీపీ మహిళా ఎమ్మెల్యే చేసిన పని బీజేపీకి మంట పుట్టిస్తోంది.

గుంటూరులో తాజాగా ఇస్కాన్ సభ్యులు రోడ్డుపై భగవద్గీత పుస్తకాలు అమ్ముతుండగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అడ్డుకున్నారు. వారు రోడ్డుపై పుస్తకాలు అమ్మడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈ మేరకు గళ్లా మాధవి చర్యను తప్పుబడుతూ ఓ ట్వీట్ పెట్టారు.

tdp mla galla madhavi stopped iskcon members from selling bhagavadgita books bjp reacts seriously

ఇందులో ఆయన "పుస్తకాలు అమ్మే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ ఇస్కాన్ సభ్యులను రోడ్డు మీద నిలదీయడం ఏంటి గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు? మీరు తెలిసి చేశారా, తెలియక చేశారో సమాజానికి తెలియదు. తక్షణమే మీరు ఈ తప్పును సరిదిద్దుకోవాలి" అన్నారు. మొన్న విజయవాడ వరదల సమయంలో ఇస్కాన్ సంస్థ లక్షలాది మంది ఆహారం, వస్త్రాలు పంపిణీ చేసిన గోప్ప సేవా సంస్థ అని, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అభినందించారని గుర్తుచేశారు.

వాళ్లు దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించి, అన్ని సౌకర్యాలును , ఉద్యోగాలను , హోదాలను త్యాగాలు చేసి ప్రభు సన్యాసి జీవితాన్ని కొనసాగిస్తున్నారని విష్ణు తెలిపారు. భగవద్గీత ప్రచారంలో బాగంగా ఇస్కాన్ స్వామీజీలు పుస్తకాలు ద్వారా భగవద్గీతను సమాజానికి పరిచయం చేయడం ఓక సాధనమన్నారు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇది ఓక ధార్మిక సంస్థగా వారు చేసే ముఖ్యమైన పని అన్నారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని విష్ణు విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+