టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియోలో ట్విస్ట్..! మహిళ షాకింగ్ కామెంట్స్..!
ఏపీలో ఇవాళ ఉదయం నుంచీ టీడీపీకి చెందిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆయన ఓ మహిళతో సరసాలు ఆడుతున్నట్లుగా ఉంది. దీంతో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే అధికార టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా ఇలాంటి కేసులోనే దొరికిపోవడం, ఆ తర్వాత సదరు మహిళతో రాజీ చేసుకోవడం అప్పట్లో దుమారం రేపింది.
ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ మహిళతోతో వీడియో కాల్ లో ఉన్న వీడియో సంచలనంగా మారడంతో ఆయన సొంత పార్టీతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా ఆరా తీయడం ప్రారంభించారు. అదే సమయంలో ఈ వీడియోలో ఉన్న మహిళ తనంతట తానే బయటికి వచ్చింది. టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళ కార్యదర్శి గుడిపల్లి వాణిగా ఆమెను గుర్తించారు. వాణి తన భర్తతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియోపై వివరణ ఇచ్చారు.

నా పేరు గుడిపల్లి వాణి
— Manchodu Mani (@manchodumani) August 4, 2025
నా ఫోన్ ను హ్యాక్ చేసి నేను, నా భర్త రైలులో వెళ్ళేటప్పుడు నేను తీసుకున్న సెల్ఫీ వీడియోలను మార్ఫ్ చేసి.. నేను నజీర్ అన్నతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు డీప్ ఫేక్ వీడియోలను రోజూ విడుదల చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. సిగ్గుండాలి రా @ysjagan https://t.co/s6GpH1p9fJ pic.twitter.com/CxHY4JmGFS
తన ఫోన్ ను హ్యాక్ చేసి తాను, తన భర్త రైలులో వెళ్ళేటప్పుడు తీసుకున్న సెల్ఫీ వీడియోలను మార్ఫ్ చేసి.. తాను ఎమ్మెల్యే నజీర్ అన్నతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు డీప్ ఫేక్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇలా తన వీడియోను డీప్ ఫేక్ చేసిన వారిపై చట్టపరంగా ముందుకెళ్లబోతున్నట్లు వాణి ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు విషయాల్లో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేతలు కావాలనే ఇలా మార్ఫింగ్ చేసి తనతో పాటు ఎమ్మెల్యే పరువు తీయడానికే ఈ వీడియోను విడుదల చేసి వైరల్ చేస్తున్నట్లు ఆమె ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications