టీడీపీ ఎమ్మెల్యే వీడియో లీక్..మహిళకు ముద్దులు పెడుతూ..
ఇటీవల ప్రజా ప్రతినిధులకు సంబంధించిన అశ్లీల వీడియోలు, ఫొటోలు తరచుగా లీక్ అవుతున్నాయి. ఏపీలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శృంగారపు వీడియో లీక్ అయింది.తనని లైంగికంగా టీడీపీ ఎమ్మెల్యే లొంగదీసుకున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం బయటకు రావడంతో కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది.
ఇక ఇదే సమయంలో బీజేపీ లీడర్లు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు సైతం అప్పట్లో సంచలనం సృష్టించాయి.జనసేన నేత కిరణ్ రాయల్ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. వివాహితతో ఆయన కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న వీడియో బయటకొచ్చింది. దీంతో ఆయన్ను జనసేన నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.

తాజాగా టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ అహ్మద్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ అహ్మద్ మహిళతో మాట్లాడుతున్నట్టు ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. సైగలు, ముద్దులు ఇవ్వడం వంటివి ఎమ్మెల్యే చేయడం ఈ వీడియోలో కనిపించాయి.
టీడీపీ ఎమ్మెల్యే మహిళతో ఉన్న వీడియో కాల్ బయటకు రావడంతో ఇది రాజకీయంగా సంచలనంగా మారింది. దీంతో ప్రతిపక్షమైన వైసీపీ టీడీపీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ అహ్మద్, ఇది వైసీపీ నేతల కుట్రగా అభివర్ణించారు. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉండటంతో, నాపై వైసీపీ నేతలు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే సదరు మహిళ టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఆమె గతంలో టీడీపీ కార్పోరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారని సమాచారం.












Click it and Unblock the Notifications