సమస్య మీది-ప్రశ్న నాది..! టీడీపీ ఎంపీ బంపర్ ఆఫర్..!
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర అవుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలే ఉండటంతో ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో ప్రశ్నలు అడగటం లేదని, కేంద్రాన్ని నిలదీయడం లేదనే విమర్శలు అక్కడకక్కడా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత కూడా అయిన లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మీరు సమస్యలు చెప్పండి, వాటిని పార్లమెంట్ లో అడుగుతానంటూ బహిరంగ ప్రకటన చేశారు.
ఇవాళ ఎక్స్ లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఓ ట్వీట్ చేశారు. ప్రియమైన యువ మిత్రులారా మరియు ఆంధ్రప్రదేశ్ యువతా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్నందున, నేను మీ నుండి వినాలనుకుంటున్నాను! TDP పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నేను, నా తోటి TDP ఎంపీలతో కలిసి, మన రాష్ట్రం మరియు మీ భవిష్యత్తు కోసం మార్పు తీసుకురావడానికి పార్లమెంటులో లేవనెత్తాల్సిన సమస్యలు ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.

టీడీపీలో ఉన్న తాము భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తామని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అలాగే మీరు దానిలో భాగం కావాలని కోరుకుంటున్నామన్నారు. కాబట్టి మీరు ఎక్స్ లో మీ కామెంట్స్ ద్వారా మీ ఆలోచనలను తెలియజేయాలని ఆయన కోరారు. జాతీయ వేదికపై ముఖ్యమైన అంశాలపై దేశం దృష్టిని ఆకర్షించడానికి కలిసి పని చేద్దామని వారికి ప్రతిపాదించారు. ఇప్పటివరకూ ఏపీకి చెందిన ఏ ఎంపీ కూడా గతంలో ఇలాంటి ప్రతిపాదన చేయలేదు. దీంతో టీడీపీ ఎంపీ ప్రతిపాదన ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

Dear young friends and youth of Andhra Pradesh, as Parliament's winter session commences tomorrow, I want to hear from you! What are the issues you feel I, as the TDP Parliamentary Party Leader, along with my fellow TDP MPs, should raise in Parliament to make a difference for our… pic.twitter.com/iq3KkVeNvx
— Lavu Sri Krishna Devarayalu (@SriKrishnaLavu) November 30, 2025
కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలే ఉండటంతో రాష్ట్ర ప్రజల్లో వీటిపై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గతంతో పోలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రం రాబట్టుకొంటున్న సాయం కూడా ఎక్కువే ఉంటోంది. అయినా ప్రజల అంచనాలు కూడా వాటితో పాటే పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన ప్రతిపాదన ఇతర ఎంపీలు కూడా అనుసరిస్తే అసలైన ప్రజాస్వామ్యానికి అర్ధం కూడా లభిస్తుంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications