ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌పై ఎంపీ మురళీమోహన్ చంద్రబాబుకు ఫిర్యాదు, ఎందుకంటే?
అమరావతి: సినీ నటులను ఉద్దేశించి టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీకి చెందిన ఎంపీ, సినీ నటుడు మురళిమోహన్ చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారు. గురువారం నాడు టెలికాన్పరెన్స్ సందర్భంగా చంద్రబాబునాయుడుకు మురళీమోహన్ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు.
రెండు రోజుల క్రితం ఏపీకి ప్రత్యేక హోదా విషయమై సినీ నటులు ఎందుకు నోరు తెరవడం లేదని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తీవ్రమైన విమర్శలు చేశారు. అవార్డులు రాకపోతే నానాయాగీ చేసే సినీ నటులు రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంటే ఎందుకు నోరు తెరవడం లేదని ఆయన ప్రశ్నించారు.

రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి కూడ తీవ్రంగానే కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై టిడిపికే చెందిన రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ కూడ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు
గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎంపీలతో టెలికాన్పరెన్స్ సందర్భంగా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సినీ నటులపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
Recommended Video

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది నటులు, టెక్నీషీయన్లు మాట్లాడిన విషయాన్ని మురళీమోహన్ గుర్తు చేశారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆ రకంగా మాట్లాడాల్సింది కాదని మురళీమోహన్ చంద్రబాబునాయుడు దృష్టికి తెచ్చారు.అయితే ఈ విషయమై తాను టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో చర్చిస్తానని బాబు టిడిపి ఎంపీ మురళీమోహన్ దృష్టికి తీసుకువచ్చారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications