వైసీపీ ఎమ్మెల్యేకు సీటు రెడీ చేస్తున్న టీడీపీ ? ఇన్ ఛార్జ్ కు బుజ్జగింపులు..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు ఆ పార్టీకి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ విపక్షాలు మాత్రం దీన్ని వాడుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ తర్వాత ప్రత్యామ్నాయ పార్టీగా కనిపిస్తున్న టీడీపీ, ఆ తర్వాత జనసేనకు నేతలు క్యూ కడుతున్నారు. అయితే అప్పటికే తమ పార్టీల తరఫున నియోజకవర్గాల్లో ఇన్ చార్జ్ లుగా ఉన్న వారిని కాదని వీరిని తీసుకునే పరిస్దితి లేదు.

రాష్ట్రంలో వైసీపీ తాజాగా ప్రకటించిన ఇన్ చార్జ్ ల మార్పుల్లో కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి కూడా తన సీటు కోల్పోయారు. ఆయన స్దానంలో పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ ను ఇన్ ఛార్జ్ గా నియమించారు. ఈ పరిణామాల్ని ముందుగానే ఊహించిన ఆయన కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. అంతే కాదు టీడీపీ నేతలతో టచ్ లోకి కూడా వెళ్లిపోయారు. చివరికి ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీకి సిద్ధమయ్యారు.

tdp preparing seat for ysrcp sitting mla? annyoing party incharge..

అదే సమయంలో బీసీ నేత అయిన పార్ధసారధి పార్టీలోకి వస్తే తమకు ఉపయోగం ఉంటుందని భావిస్తున్న టీడీపీ.. ఆయన కోరిక మేరకు పెనమలూరు సీటునే కేటాయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏలూరు జిల్లాలోని నూజివీడు సీటును ముందుగా పార్ధసారధికి ప్రతిపాదించిన టీడీపీ.. ఆయన ససేమిరా అనడంతో పెనమలూరు సీటునే ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. అయితే ఇక్కడే ఆ పార్టీకి చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం అక్కడ టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

tdp preparing seat for ysrcp sitting mla? annyoing party incharge..

దీంతో బోడే ప్రసాద్ ను బుజ్జగించేందుకు అధిష్టానం దూతను పంపింది. అధిష్టానం ఆదేశాలతో పొరుగున ఉన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రంగంలోకి దిగారు. బోడే ప్రసాద్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అయితే బోడే వెనక్కి తగ్గేందుకు నిరాకరిస్తున్నారు. కానీ అధిష్టానం ఇతరత్రా ప్రతిపాదనలు చేస్తే మాత్రం బోడే ప్రసాద్ తప్పుకుని పార్ధసారధికి లైన్ క్లియర్ చేసే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+