రెండు చోట్ల ఓడిపోయిన నిన్ను ఎమ్మెల్యేగా చేసిందే టీడీపీ ..40 ఏళ్ల మా పార్టీని నువ్వు నిలబెట్టేది ఏంటి..?
జనసేన ఆవిర్భావ వేడుకలో మెగా బ్రదర్స్ ఇచ్చిన స్పీచ్‌పై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనసేన నుంచి కొత్తగా ఎమ్మెల్సీగా ఎంపిక అయిన నాగబాబు జనసేన ఆవిర్భావ వేడుకలో మాట్లాడుతూ .. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం సాధించారంటే అది జనసేన కార్యకర్తలు, అక్కడి ఓటర్ల వల్లనే అంటూ కామెంట్ చేశారు. నా వల్లే పవన్ కల్యాణ్ గెలిచారు.. పవన్ కల్యాణ్‌ను నేనే గెలిపించాను అనుకుంటే అంత కన్న పెద్ద పొరపాటు లేదు. అలా అనుకుంటే అది వారి ఖర్మే అంటూ పిఠాపురం టీడీపీ నేత వర్మను ఉద్దేశించి ఆయన పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇక ఇదే సభ నుంచి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి.
TDP Won because of CADRE
— జై బాలయ్య 🦁 (@harsha_0999) March 14, 2025
TDP is winning because SR NTR
Okkalu nilabedithe gelichina party kadu
Okkalu thokithe odipoye party kadu
Jai NTR Jai TDP pic.twitter.com/JYphh9aLYm
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..గత వైసీపీ పాలనను అంతమొందించాం. మనం నిలదొక్కుకోవడమే కాకుండా 40 ఏళ్ల టీడీపీని కూడా నిలబెట్టాం అంటూ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే నాగబాబు, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 2004,2009 వరుస ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంలో కూడా టీడీపీ ప్రజల్లో బలంగా ఉందనే విషయాన్ని శ్రేణులు జనసేన అధినేతకు గుర్తు చేస్తున్నారు.గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే దానికి నాలుగు ప్రధాన కారణాలని ..టీడీపీ అధినేత చంద్రబాబు ,నారా లోకేష్ యువగళం పాదయాత్ర ,తెలుగుదేశం కార్యకర్తల పోరాటం,జగన్ మోహన్ రెడ్డి అరాచకం ఇది కాకుండా నేనే నిలబెట్టాను నేనే గెలిపించాను అని అనుకునే వాళ్ళు అందరూ అవివేకులు అంటూ ఓ టీడీపీ అభిమాని పవన్ కల్యాణ్‌కు సెటైర్ వేశారు.

నువ్వొస్తే పొత్తులకి పోయి కుక్కలతో మాటలు పడకుండా పార్టీ గౌరవంని కాపాడుకోవచ్చు @tarak9999
— appie 🎀 (@fizz_nandamuri) March 14, 2025
better late than never.
pic.twitter.com/Ei0ZGQGjB6
4 నుంచి 5 ఓటింగ్ శాతం ఉన్న జనసేనను 7కు పైగా తీసుకువెళ్లింది టీడీపీ. అలాంటి టీడీపీని నువ్వు నిలబెట్టేది ఏంటీ అని ఓ టీడీపీ అభిమాని జనసేనను ప్రశ్నించాడు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన నువ్వు మా పార్టీని నెలబెట్టావా..జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే, నీలాంటి వారితో పొత్తులు లేకుండా ఎన్నికల్లో గెలిచి చూపిస్తాం అంటూ మరో టీడీపీ అభిమాని రియాక్ట్ అయ్యాడు. ఒక్కడు నిలబెడితే నిలబడే పార్టీ కాదు..ఒకడు తొక్కేస్తే ఓడిపోయే పార్టీ కాదంటూ ఓ టీడీపీ అభిమాని కామెంట్ చేశాడు. ఇలా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తమదైనశైలిలో రియాక్ట్ అవుతున్నాయి.
ఈడు నిలబెట్టాడు అంట 🤣🤣
— Geetha vijaya ™️ 😍✌️ (@geetha_happy2) March 15, 2025
పొత్తు లో seats పంచింది మేము మీరు కాదు 😝😝
2019 136 పోటీ 1 , 5.6%
2024 21 పోటీ మేము వేసిన ముష్టి 6.8%
2019 175 పోటీ 23 , 39.69%
2024 135 win 45.60%
ముందు vote % double digits కి రండి అప్పుడు పక్క వాడిని నిలబెడుదురు 😄😄 pic.twitter.com/aTcyvZgSp4
రెండు చోట్ల ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయిన నిన్ను ఎమ్మెల్యే గా చేసింది టీడీపి పార్టీ.
— Praneeth Chowdary (@praneethballa) March 14, 2025
నాలుగు శాతం ఓట్లు వున్న నీ పార్టీ కి ఏడు శాతం ఓట్లు, ఇరవై ఒక్క సీట్లు వచ్చేలా చేసింది టీడీపి పార్టీ.
కోటి పైగా కేడర్ తో, నలభై సంవత్సరాలు నుండి పాతుకుపోయిన పార్టీని నువ్వు నిలబెట్టేది ఏంటి? pic.twitter.com/JQ0bkC3Fc9












Click it and Unblock the Notifications