టీడీపీ తొలి జాబితా విడుదల- 7 కార్పోరేషన్లు, 29 మున్సిపాలిటీ అభ్యర్ధులు వీరే..!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న తెలుగు దేశం పార్టీ(TDP).. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 7 కార్పోరేషన్లు, 29 మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఇందులో ఉన్నారు. ఈ జాబితాను నిన్న అర్ధరాత్రి విడుదల చేశారు. ఇందులో పలువురు కొత్త ముఖాలకు చోటు కల్పించారు. వైఎస్సార్సీపీ తాజాగా రెండు విడతలుగా అభ్యర్ధుల జాబితాలను విడుదల చేసింది.

టీడీపీ విడుదల చేసిన మున్సిపల్ కార్పోరేషన్ల మేయర్ అభ్యర్ధుల జాబితాలో ఏడు పేర్లు ఉన్నాయి. ఇందులో చిత్తూరు కార్పోరేషన్ కు మేయర్ అభ్యర్దిగా కటారి హేమలత, కడప కార్పోరేషన్ మేయర్ అభ్యర్ధిగా డా.నెల్లటూరి సువర్ణ, కర్నూలు కార్పోరేషన్ మేయర్ అభ్యర్దిగా విజయ ప్రత్యూష, నెల్లూరు కార్పోరేషన్ కు మేయర్ అభ్యర్దిగా పోలుబోయిన రూప్ కుమార్, తిరుపతి కార్పోరేషన్ కు మేయర్ అభ్యర్దిగా మన్నెం శ్రీనివాస ప్రసాద్, విశాఖపట్నం కార్పోరేషన్ కు మేయర్ అభ్యర్దిగా డా.ముక్క శ్రావణి, విజయనగరం కార్పోరేషన్ కు మేయర్ అభ్యర్ధిగా అవనపు భార్గవిని ప్రకటించారు.

Tdp releases first list of candidates for municipal polls including 7 corporations 29 municipalities

అలాగే 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఛైర్మన్ అభ్యర్ధుల జాబితా కూడా ప్రకటించారు. ఇందులో
ఆళ్ళగడ్డకు అనీషా షేక్, అద్దంకిలో కాకాని అశోక్, ఆదోనిలో నాగమణి, నంద్యాల జిల్లా ఆత్మకూరులో డా. గోవింద రాజులు, బద్వేలులో సోమశిల దివ్య తేజ, బొబ్బిలిలో రాంబార్కి రేణుకా దేవి స్వప్న, దాచేపల్లిలో తంగెళ్ల శ్రీనివాసరావు, ధర్మవరంలో పరిశె సుధాకర్, గురజాలలో నెలవల్లి బొల్లయ్య, హిందూపురంలో పి.ఎస్.మంజునాథ్, ఇచ్ఛాపురంలో ఆసి లీలా రాణి, జగ్గయ్యపేటలో నరేంద్రుల వినీత, జమ్మలమడుగులో జ్యోతి చాడిప్రళ్ల, కమలాపురంలో గొంగలిరెడ్డి స్వప్న, కుప్పంలో ఎస్.రాజకుమార్, మాచర్లలో ఏనుముల సుష్మ, మదనపల్లెలో శ్రీరామ్ చిన్న బాబు, మార్కాపురంలో వక్కలగడ్డ మల్లికార్జున్, నగరిలో శ్రీనివాసన్, పలాస కాశీబుగ్గలో వజ్జ గంగాభవాని, పెద్దాపురంలో వత్సవాయి ఎల్.ఎస్.ఎన్.రాజు, పెనుకొండలో త్రివేంద్ర మూర్తి, పులివెందులలో తుగుట్ల గీతా కుమారి, రాజంపేటలో డా.దొంతం గాయత్రి, రామచంద్రపురంలో మేడిశెట్టి శేషారావు, రాయచోటిలో ఖాదర్ వలి షేక్, రాయదుర్గంలో టంకశాల హనుమంతు, రేపల్లెలో కె.అపర్ణ, సూళ్లూరుపేటలో పిట్టల సుహాసిని ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+