Tdp Second List: టీడీపీ రెండో జాబితా విడుదల- 34 పేర్లు ఇవే..!

అంతా ఊహించినట్లుగానే టీడీపీ ఇవాళ 34 మంది అభ్యర్ధులతో రెండో జాబితా విడుదల చేసింది. ఇప్పటికే 94 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసిన టీడీపీ ఇవాళ 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేసారు. ఇందులో పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే పలువురు సీనియర్లకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది.

tdp releases second list with 34 assembly contestants- here are candidates

ఇవాళ విడుదలైన టీడీపీ రెండో జాబితాలో ఉన్న పేర్లలో బొగ్గు రమణమూర్తి (నరసన్నపేట), పల్లా శ్రీనివాసరావు (గాజువాక), కేఎస్ఎన్ రాజు(చోడవరం), పైలా ప్రసాద్ (మాడుగుల), వరుపుల సత్యప్రభ (ప్రత్తిపాడు), వాసంశెట్టి సుభాష్ (రామచంద్రపురం), గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమండ్రి రూరల్), మిర్యాల శిరీష (రంపచోడవరం), ముప్పిడి వెంకటేశ్వరరావు (కొవ్వూరు), చింతమనేని ప్రభాకర్ (దెందులూరు) ఉన్నారు.

అలాగే ఈ జాబితాలో మద్దిపాటి వెంకటరాజు (గోపాలపురం), భాష్యం ప్రవీణ్(పెదకూరపాడు), పిడుగురాళ్ల మాధవి (గుంటూరు వెస్ట్), మొహమ్మద్ నజీర్ (గుంటూరు ఈస్ట్ ), యరపతినేని శ్రీనివాసరావు (గురజాల), ఇంటూరి నాగేశ్వరరావు (కందుకూరు), కందుల నారాయణరెడ్డి (మార్కాపురం), ముత్తుముల అశోక్ రెడ్డి(గిద్దలూరు), ఆనం రామనారాయణరెడ్డి(ఆత్మకూరు), వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (కోవూరు), కురుగొండ్ల లక్ష్మీప్రియ (వెంకటగిరి), పుత్తా చైతన్యరెడ్డి (కమలాపురం), వరదరాజులరెడ్డి(ప్రొద్దుటూరు), గిత్తా జయసూర్య (నందికొట్కూరు) ఉన్నారు.

అలాగే ఈ లిస్టులు జయనాగేశ్వరరెడ్డి (ఎమ్మిగనూరు),రాఘవేంద్ర రెడ్డి (మంత్రాలయం), పల్లె సింధూరారెడ్డి (పుట్టపర్తి), కందికుంట యశోదా దేవి (కదిరి), షాజహాన్ బాషా ( మదనపల్లె), చల్లా రామచంద్రారెడ్డి (పుంగనూరు), పులివర్తి నాని (చంద్రగిరి), బొజ్జల సుధీర్ రెడ్డి (శ్రీకాళహస్తి ), కోనేటి ఆదిమూలం (సత్యవేడు), డాక్టర్ కలికిరి మురళీమోహన్ (పూతలపట్టు ) ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+