టీడీపీ ‘సంకెళ్ల’ ఫోటోషూట్, కొవ్వొత్తులతో ‘సెలెబ్రేషన్స్’ తో ప్రజలకు కొత్త అవగాహన!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు కోసం మేము సైతం అంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆందోళనలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
హక్కుల కోసం పోరాడే పేదలను అణిచివేయాలని చూసినప్పుడు స్వేచ్ఛకు బేడీలు వేస్తారని పౌరసంఘాలు నిరసన తెలపడం చూశామని, చంద్రబాబు అనే అవినీతి తిమింగలం సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తే చేతులకు తాళ్లు, గొలుసులతో ప్రదర్శనలు చేసి పచ్చ పార్టీ పరువు తీసుకుంది అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఈ ఫోటోషూట్ కి ఐడియా లోకేష్ దేనిని టిడిపివర్గాల భోగట్టా అంటూ లోకేష్ ను టార్గెట్ చేశారు.

వీళ్లు చేసే 'సంకెళ్ల' ఫోటోషూట్, లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే 'సెలెబ్రేషన్స్' ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రజలకు చంద్రబాబు గారు చేసిన స్కాంల గురించి అవగాహన పెంచుతున్నాయి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. నిరసన పేరుతో వీళ్లు డ్రామాలు చేసిన ప్రతిసారి ఒక వర్గం వాళ్లే తల్లడిల్లిపోతున్నారన్నారు. బాబు గారి జైలు పుణ్యాన వీళ్ల అసలు రూపాలు బయట పడ్డాయి అని విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు.
ఇదే సమయాల్లో తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పోటీపై సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో పోటీ చేయదట. క్యాండిడేట్లు దొరకడంలేదని అనుకోవాలా? అంటూ ప్రశ్నించారు. 87 సీట్లలో మాత్రమే అభ్యర్థులను నిలబెడతామని అక్కడి పార్టీ అధ్యక్షుడు ప్రకటించారన్నారు.

తెలంగాణ ప్రాంతానికి కూడా చంద్రబాబు గారు తొమ్మిదేళ్లు సిఎంగా ఉన్నారు అని గుర్తు చేసి, అన్ని స్థానాల్లో టిడిపి పోటీ చేయలేకపోవడం పై టీడీపీ బలహీన పడిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో పచ్చ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications