మాజీ మంత్రి రావెలపై టీడీపీ కార్యకర్తల దాడి!, గల్లాపైనా: ఉద్రిక్తత

Subscribe to Oneindia Telugu

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, ఎంపీ గల్లా జయదేవ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగడంతో గుంటూరు జిల్లా వింజనంపాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటన ప్రత్తిపాడు నియోజకవర్గంలో నిర్వహించిన ఇంటింటికీ కార్యక్రమంలో చోటుచేసుకుంది.

  Mothkupalli Narsimhulu Forced To Chandra Babu చంద్రబాబుకు మోత్కుపల్లి ఒత్తిడి..| Oneindia Telugu
  గల్లా జయదేవ్‌కు షరతులు

  గల్లా జయదేవ్‌కు షరతులు

  ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ గల్లా జయదేవ్‌ను కలిసిన ఓ వర్గం కార్యకర్తలు రావెల కిశోర్ బాబు తమ గ్రామానికి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమం నిర్వహించాలనుకుంటే గ్రామంలో మొదట్లో ఉన్న ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాతే లోపలికి అడుగుపెట్టాలని షరతు విధించారు. దీనికి ఆయన సరేనన్నారు.

  మరో వర్గం ఆగ్రహం.. బహిష్కరణ

  మరో వర్గం ఆగ్రహం.. బహిష్కరణ


  అయితే, పార్టీలోని వేరే వర్గం వారు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాల వేయకుండానే ఆవిష్కరించడంతో ఆ వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని బహిష్కరించారు.

  రావెల, గల్లాపై దాడికి యత్నం

  రావెల, గల్లాపై దాడికి యత్నం

  దీంతో కార్యక్రమం పూర్తయిన తర్వాత మాజీ మంత్రి రావెలతో కలిసి అసంతృప్త వర్గం ఏర్పాటు చేసిన విగ్రహాలకు దండలు వేసేందుకు జయదేవ్ ప్రయత్నించారు. గమనించిన ఆ వర్గం నేతలు జయదేవ్, కిశోర్ బాబులను అడ్డుకున్నారు. వారిపై దాడికి ప్రయత్నించారు.

  పోలీసుల సాయంతో..

  పోలీసుల సాయంతో..

  ఈ క్రమంలో టీడీపీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, పోలీసుల సాయంతో ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి రావెల అక్కడి నుంచి బయటపడ్డారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that TDP workers allegedly attacked on Andhra Pradesh former minister Ravela Kishore Babu and MP Galla Jayadev in Guntur district.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి