వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'క్షణం తీరిక లేకుండా': ఐటీపై చంద్రబాబు మదిలో ఏముంది? (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తామని టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ అన్నారు. సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఐటి రంగ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు.

తిరుపతిలో నెలకొల్పనున్న ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ (ఐఐడిటి)లో 'సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ రోబోటిక్స్‌ అండ్‌ ఎనలిటిక్స్‌' విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని ఐఐడిటిలో ఏర్పాటు చేసే విభాగం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.

 చంద్రబాబుతో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ భేటీ

చంద్రబాబుతో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ భేటీ


విశాఖపట్నంలోని టెక్‌ మహీంద్రా ఫెసిలిటీ సెంటర్‌లో మరో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలో ఐటి అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలు సామాన్యుడిని చేరాలంటే సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

చంద్రబాబుతో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ భేటీ

చంద్రబాబుతో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ భేటీ


అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గుర్నానీకి సూచించారు. హైదరాబాద్‌లో స్పల్వకాలంలో హైటెక్ సిటీ నిర్మించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేశారని చంద్రబాబును గుర్నానీ అభినందించారు.

చంద్రబాబుతో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ భేటీ

చంద్రబాబుతో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ భేటీ


దీనిపై గుర్నానీ స్పందిస్తూ...'మీ దార్శనికత నాకు తెలుసు. ఐటి రంగ అభివృద్ధిలో మీ సత్తా తెలియనిది కాదు. కొత్తదనాన్ని కోరుకునే మీరు హైదరాబాద్‌లో ఐటిని స్వల్ప కాలంలో అభివృద్ధి చేసిన విషయాన్ని మర్చిపోలేదు. నవ్యాంధ్రలో కూడా ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉంది' అని అన్నారు.

 చంద్రబాబుతో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ భేటీ

చంద్రబాబుతో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ భేటీ


క్షణం తీరిక లేకుండా పనిచేయడంలో చంద్రబాబు నాయుడిని తాను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కోర్ టీమ్ సలహాదారుల్లో ఒకరుగా ఉంటూ సేవలు అందించేందుకు గుర్నానీ అంగీకరించారు.

English summary
Tech Mahindra CEO CP Gurnani Meets AP CM Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X