పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన టెక్కీ అరెస్టు

వివరాలు ఇలా ఉన్నాయి - విశాఖపట్నానికి చెందిన సందీప్ సిన్హా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ద్వారా ఓ యువతితో స్నేహం చేశాడు. ఆ తర్వాత వారిద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి కోసం ఆమె ఒత్తిడి తెస్తుండడంతో దూరం జరుగుతూ వచ్చాడు. ఆమె కులం పేరు చెప్పి పెళ్లికి నిరాకరించే ప్రయత్నం చేస్తూ వచ్చాడని ఆరోపిస్తున్నారు.
ఆమె కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. అతను దూరం అవుతూ వస్తుండడంతో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. అతనిపై ఫిర్యాదు చేసింది.
పోలీసులు సందీప్ సిన్హాను అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications