నేడు విశాఖకు రేవంత్ - జగన్, చంద్రబాబు టార్గెట్ గా..!!
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి ఏపీకి వస్తున్నారు. సేవ్ విశాఖ- సేవ్ స్టీల్‌ప్లాంట్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. స్టీల్‌ప్లాంట్‌లోని తృష్ణా మైదానంలో జరిగే ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధ్యక్షతన జరిగే ఈ సభలో రేవంత్ ప్రసంగం పైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (శనివారం) ఏపీలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు రేవంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం స్టీల్‌ప్లాంట్ గ్రౌండ్స్‌లో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభావేదికగా సేవ్ వైజాగ్ - సేవ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ విడుదల చేయనుంది. ఈ సభలో కాంగ్రెస్ ముఖ్య నేతలు మాణిక్కం ఠాగూర్, సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి, మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుతోపాటు పలువురు నాయకులు హాజరు కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడమే ధ్యేయంగా పోరాటం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

ప్రత్యేక హోదాను ప్రత్యేకంగా కాంగ్రెస్ ఎన్నికల అజెండాలో చేర్చింది. అదేవిధంగా నవరత్నాలలో ఒక్కటైన విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలని కాంగ్రస్ డిమాండ్ చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖలో జరిగే బహిరంగ సభలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేయనున్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి పార్టీ తరఫున డిక్లరేషన్‌ను ప్రకటన చేయనున్నారు. ఇదే సమయంలో ఏపీలో అధికార వైసీపీ తో పాటుగా బీజేపీతో జత కట్టిన టీడీపీ, జనసేన పైన రేవంత్ ఎలాంటి కామెంట్స్ చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?












Click it and Unblock the Notifications