చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఫోన్ కాల్-కీలక అంశాల ప్రస్తావన.. !
ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ కాల్ చేశారు. ఏపీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయంపై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఎక్స్ లో చంద్రబాబుకు ఓసారి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ .. ఇవాళ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ సంకేతాలు ఇచ్చారు.
చంద్రబాబుకు ఇవాళ ఫోన్ కాల్ లో శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి.. అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు నెలకొనాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. అలాగే విభజన సమస్యల పరిష్కారానికి కలిసి రావాలని చంద్రబాబును రేవంత్ కోరారు. దీంతో చంద్రబాబు కూడా కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పినట్లు తెలిసింది. అలాగే విభజన సమస్యల్ని కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకునేందుకు సిద్ధమన్నారు.

మరోవైపు ఈ నెల 12న జరిగే తన ప్రమాణస్వీకారానికి రావాలని కూడా చంద్రబాబు రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ఆహ్వానం పంపుతామని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే వెళ్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాగే కొత్తగా ఏర్పాటయ్యే ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని కూడా ఫలితాలకు ముందే రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఈ గురుశిష్యులు కలిసి పనిచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications