• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Oscar 2023కి నాటు నాటు నామినేట్: చరిత్ర లిఖించడానికి ఒక్క అడుగు దూరంలో ఆర్ఆర్ఆర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్తాను చాటి చెప్పిన మరో మూవీ ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా అందుకున్న బాక్సాఫీస్ కలెక్షన్లు 1,000 కోట్ల రూపాయల మార్క్‌ను దాటేశాయి. మొన్నీ మధ్యే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిందీ మూవీ. ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించింది.

అవార్డుల పంట..

అవార్డుల పంట..

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్ నటించిన ఈ పాన్ ఇండియా సినిమా తృటిలో ఆస్కార్ అవార్డ్ కోసం పోటీ పడుతోంది. అదే సమయంలో న్యూయార్క్ క్రిటిక్స్ నుంచి బెస్ట్ డైరెక్టర్‌ కేటగిరీలో టాప్‌లో నిలిచింది. బెస్ట్ డైరెక్టర్ అవార్డును రాజమౌళి అందుకున్నారు. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో అత్యుత్తమంగా నిలిచింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్‌లైట్ అవార్డును కూడా అందుకుందీ మూవీ.

గోల్డెన్ గ్లోబ్ తో..

గోల్డెన్ గ్లోబ్ తో..

ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డును అందుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని సూపర్ హిట్ పాట నాటు నాటు.. ఈ కేటగిరీలో బెస్ట్ ఒరిజినల్ ట్రాక్ అవార్డును సొంతం చేసుకుంది. అమెరికా కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్ లోని బేవర్లీ హిల్టన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఆస్కార్ కు అర్హత..

కాగా- ఇప్పుడు తాజాగా మరో చరిత్రను లిఖించడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది ఆర్ఆర్ఆర్. అదే ఆస్కార్ అవార్డ్. ఆస్కార్ అవార్డ్ 2023కి అధికారికంగా నామినేట్ అయింది ఈ మూవీలోని నాటు నాటు పాట. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ అవార్డుకు నామినేట్ అయింది. ఆస్కార్ అవార్డుల అకాడమీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ మేరకు కొద్ది సేపటి కిందటే ఓ ట్వీట్ చేసింది.

నాటు నాటుతో పాటు..

నాటు నాటుతో పాటు..

నాటు నాటు తో పాటు టెల్ ఇట్ లైక్ ఎ విమెన్ లోని అప్లాజ్, టాప్ గన్ మావెరిక్ లోని హోల్డ్ మై హ్యాండ్, బ్లాక్ పాంథర్- వకాండ ఫరెవెర్ లోని లైఫ్ మీ అప్, ఎవెరీ థింగ్, ఎవెరీ వేర్ ఆల్ అట్ వన్స్ లోని దిస్ ఈజ్ ఎ లైఫ్ పాటలు ఇదే కేటగిరీలో నామినేట్ అయ్యాయి. ఇందులో ఏ పాటకు ఆస్కార్ అవార్డ్ లభిస్తుందనేది త్వరలో తేలిపోనుంది.

English summary
Telugu film RRR's Naatu Naatu' song makes it to Oscars nominations in this category, check deets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X